వేసవి శిబిరాన్ని సందర్శించిన నల్గొండ జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి
(NTODAY NEWS) నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూనూరు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో నిర్వహిస్తున్న వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని నల్గొండ జిల్లా యువజన మరియు క్రీడాశాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 14 గ్రామాలలో వివిధ క్రీడలలో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించడానికి వేసవి శిక్షణ శిబిరాలను ప్రభుత్వం చేపట్టిందని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి క్రీడా స్ఫూర్తిని వెలికితీయడం కోసమే దీని ముఖ్య ఉద్దేశమని విద్యార్థులలో క్రీడల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించడంతోపాటు క్రీడలలో ఉండే మెలకులను విద్యార్థులు ఈ ఉచిత హాకీ శిక్షణ శిబిరంలో నేర్చుకుంటారని అన్నారు అంతే కాకుండా క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని క్రీడల వల్ల స్నేహభావాన్ని పెంపొందించుకోవచ్చు అని సమాజంలో క్రమశిక్షణతో ఎలా మెలగాలో తెలియజేస్తాయని అన్నారు. క్రీడలతోపాటు ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో వ్యాయామ తరగతులు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు క్రీడల వల్ల భవిష్యత్తులో క్రీడా విభాగంలో ఉన్నత ఉద్యోగాలను కూడా సంపాదించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగొచ్చని విద్యార్థులకు తెలియజేశారు అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల వేసవి శిక్షణ హాకీ శిక్షకుడు గంగాపురం రాము, సీనియర్ క్రీడాకారుడు ఎలుగు చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు ధర్మేందర్ , విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.