నూతనంగా ఎన్నుకోబడిన ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ కార్యవర్గం
NTODAY NEWS: ఏలూరు
శనివారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ జనరల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికల పరిశీలకులుగా ఏలూరు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి ఎన్నికల నిర్వహించి ఈ కింది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోబడటమైనది. అధ్యక్షులుగా కురమా ఆనందకుమార్(2వ సారి), ఉపాధ్యక్షులుగా ఎల్.వి.ఏ రత్నకుమార్, ఎం.వి సుబ్బారావు, ఎం.డబ్ల్యూ బెనర్జీ, ఏ.సుహాసిని ప్రధాన కార్యదర్శిగా అబ్బదాసరి శ్రీనివాసరావు(2వ సారి) కార్యదర్శులుగా కే. పొట్టియ్య, ఎం వెంకటేశ్వరరావు, ఏ. సాంబమూర్తి,కె లలిత, సరిపల్లి వెంకట్రావు జిల్లా కౌన్సిలర్లుగా డి.ఎస్.వి ప్రసాద్, చింత వెంకటరత్నం, కే. శ్యామల, కె.కుమార్, జి రాజారావు, ఎం ఎస్ ఎన్ మూర్తి ఆర్ అబ్బులు జె శాంతి కుమార్ ఎం. అన్నపూర్ణ, టి.శ్రీనివాసరావు, సి.హెచ్. శివాజీ మరియు ఆడిట్ కమిటీ సభ్యులుగా ఏ.సింహాచలం,పి.నాగరాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రామారావు మరియు జిల్లా కార్యదర్శి డి.కె.ఎస్.ఎస్. ప్రకాష్ హాజరయ్యారు.

