పార్డ్ ఇండియా కంప్యూటర్ శిక్షణా సర్టిఫికెట్లు ప్రధానం
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో ని పార్డ్ ఇండియా కార్యాలయంలో మంగళవారం సంస్థ వేసవిలో నిర్వహించు ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంచాయితీ కార్యదర్శి ఏ అమ్మిరాజు మాట్లాడుతూ పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. 2011 నుండి విలేజ్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుచేసి ప్రతీ ఏటా వేసవిలో విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నామని సంస్థ గౌరవ అధ్యక్షులు కారుమంచి గణేష్ తెలిపారు.పార్డ్ ఇండియా సంస్థ నెలకొల్పి సమాజ హితానికి ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు బేతాల వీరాస్వామి ఆదర్శప్రాయులని సచివాలయ కార్యదర్శి గారపాటి రవికుమార్ అన్నారు.కార్యక్రమంలో పార్డ్ ఇండియా సభ్యులు దేవరాజు అచ్యుతరావు ధూళిపూడి రవీంద్ర సోమశెట్టి వెంకటరావు డేవిడ్ హేమకుమార్ గుదే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.