వైద్య విద్యార్థికి స్కాలర్షిప్ అందించిన పార్డ్ఇండియా
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం పార్డ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఎంబీబీఎస్ చదువుతున్న చిన్నాయగూడెం గ్రామానికి చెందిన మెడికో వంపుగడప బాబుకు 5 వేల రూపాయల స్కాలర్షిప్ ను సంస్థ సభ్యులు సోమశెట్టి వెంకటరావు చేతుల మీదుగా అందించారు ఈ సంస్థ డైరెక్టర్ బేతాళ వీరస్వామి గారు మపట్ల అనేకులపట్ల దయచూపి టైలరింగ్ సెంటర్ ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మెడికల్ క్యాంప్స్ 108 ఎమర్జెన్సీ వెహికల్ మొక్కలు పంపిణీ ఈలా అనేక విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు వీరస్వామికి సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియపరిచారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ కొంపల్లి బాబూరావు బేతాల దుర్గ బేతాల నాగమణి జి నాగమణి జి బాబు ఎస్ నాని తదితరులు పాల్గొన్నారు.