BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురైన పెన్షన్ దారులు.

తెలంగాణ
02 Sep, 2025 - 10:31 PM
392 వీక్షణలు
గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్వాకం వలన తీవ్ర ఇబ్బందులకు గురైన పెన్షన్ దారులు. NTODAY NEWS: జగ్గయ్యపేట రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ లో కొంతమంది అనర్హులు కూడా ఉండటంతో రి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పెనుగంచిప్రోలు గ్రామంలోని కొంతమంది పెన్షన్ దారులకు గత మార్చి, ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చి జగ్గయ్యపేటలో వెరిఫికేషన్ నిర్వహించారు. అలాగే ఈ నెలలో కూడా మరి కొంతమందిని రీ వెరిఫికేషన్ చేసే ఉద్దేశంతో నోటీసులు జారీ చేయాలని గ్రామ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వచ్చాయి. ఈ నోటీసులు కూడా ఆయా పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి అందజేయాలని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ పెనుగంచిప్రోలలోని సచివాలయ సిబ్బంది నోటీసులు అందుకునే పెన్షన్ దారులకు ఈ నెల పెన్షన్ ఇవ్వకుండా ఈనెల పెన్షన్ జాబితాలో మీ పేరు లేదని మీరు గ్రామ సచివాలయానికి వెళ్లి అధికారులు సంప్రదించాలని వారు తెలిపారు. దీంతో తమ పెన్షన్ ఆగిపోయిందేమోనని, అలాగే నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులను, వికలాంగులను గ్రామ సచివాలయాన్ని వద్దకు ఎలా తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎలాగో కష్టపడి సచివాలయం దగ్గరకు వెళ్లిన పెన్షన్ దారులకు ఈ నెల పెన్షన్ ను అందజేసి ఈనెల నాలుగవ తేదీన జగ్గయ్యపేటలో రి వెరిఫికేషన్ జరుగుతుందని అక్కడికి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలని నోటీసులు జరీ చేశారు. అసలు పెన్షన్ దారులు ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేయవలసిన అధికారులు గ్రామ సచివాలయాన్ని పిలిపించుకొని నోటీసులు ఇవ్వటం ఏమిటని పలువురు పెన్షన్ దారుల ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube