భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Spread the love

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా

వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న 72 గంటలు భారీ వర్గాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు మంగళవారం రోజున అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలను ఆప్రమత్తం చేయాలన్నారు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు సహాయక చర్యలకు అవసరమైన నిధులను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అన్నారు ఉద్యోగులు, సిబ్బందికి మూడు రోజులు సెలవులు రద్దు చేయాలన్నారు పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని, ఐటీ ఉద్యోగులు వర్క్ హోం నిర్వహించాలన్నారు అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను సూచించారు గతంలో ఖమ్మంలో రెండు గంటల్లో 42 సెంటీమీటర్ల వర్షం పడింది అని అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు లాండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలని అన్నారు ఎక్కడ ఏం జరిగినా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందేలా చర్యలు తీసుకొని ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి మొబైల్ ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచాలన్నారు ఆకస్మిక వరదలు వస్తే హెలికాప్టర్లను అందుబాటులో ఉండాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఆదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు

జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వాతావరణం శాఖ హెచ్చరిక మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా లో రాబోయే మూడు రోజు (72) గంటలు భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయని జిల్లా అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రానున్న మూడు రోజులు అతి నుండి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా లో ఎలాంటి ప్రాణ,ఆస్తి,పశువులు నష్టాలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా అధికారులందరు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 08685293312.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »