వంకాయలపాడు గ్రామ శివారులో కోతముక్క ఆటపై పోలీసుల దాడి..
NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా….
ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామ శివారులో నిన్న రాత్రి కోతముక్క ఆట జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు.రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుండి నగదు 15,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
రాత్రి సమయంలో బందోబస్తు విధుల్లో పోలీసులు ఉన్నప్పుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగుతాయని గుర్తించి, ఇలాంటి సంఘటనలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ టి.శివరామకృష్ణ మాట్లాడుతూ, జూదం, కోతముక్క, కోడి పందేలు వంటి అక్రమ కార్యక్రమాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

