యాదాద్రి జిల్లాలో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న స్టోన్ క్రషర్ల పై కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం మండల తహశీల్దార్ శ్రీనివాస్ రావు కి ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ప్రజా పోరాట సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీస శ్రీనివాస్ మైలారం జంగయ్య మాట్లాడుతూ అక్రమ క్వారీలు నిర్వహించే క్రషర్ యజమానులు రాళ్ళ సొమ్మును దోచుకొని కోట్లు గడిస్తున్నారని, పేదలు మాత్రం ఇండ్లు పర్రెలు వట్టి లక్షలాది రూపాయలు నష్టపోయారని తక్షణం వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.పర్మిషన్ ఒకచోట తవ్వేది మరోచోట జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు? ముఖ్యంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా చేస్తున్నారని అన్నారు.మూడు వే బిల్లులు చూపి ముప్పై ట్రిప్పుల రాయితీస్తున్నారని,ఖనిజ సంపద మొత్తం లూటీ చేస్తున్నా అధికారులు మాత్రం మామూళ్ళ మత్తులో మునిగారని ఇకనైనా కళ్లు తెరవాలని హితవు పలికారు.డీటీపీఎస్,ఈటీస్ విధానంలో సర్వే చేసి అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వట్టిపల్లి సుదర్శన్,మైలారం సుదర్శన్, బాలరాజు పాల్గొన్నారు.
