ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక
NTODAY NEWS: చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మండల ప్రైవేట్ ఎలక్ట్రిషన్స్ వర్కర్ స్ యూనియన్ సోమవారం రోజున నూతన కార్యవర్గాన్ని తాడూరి చంద్రం అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో అధ్యక్షుడిగా బెల్లి యాదయ్య గౌరవ సలహాదారునిగా తాడూరి చంద్రం అధ్యక్షునిగా SK గౌస్ పాషా, , ప్రధాన కార్యదర్శిగా కడారి వెంకన్న, సహాయ కార్యదర్శిగా రాధారపు సైదులు, ఉపాధ్యక్షుడిగా గోకుల సతీష్ రెడ్డి, కోశాధికారిగా మహమ్మద్ అలీ, కార్యవర్గ సభ్యులుగా ఉయ్యాల యాదగిరి, విప్పర్తి ఏడుకొండలు ఎస్ కే భాష ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ ఎలక్ట్రిషన్ యూనియన్ సభ్యులకు కలిసికట్టుగా ఉండి తమ యొక్క హక్కులను సాధించుకుంటాం అని అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని , నూతన కార్యవర్గానికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆరూరి సత్తయ్య ఖమ్మంపాటి నరసింహ, దేశపాక యాదగిరి బరా సామి లక్ష్మీనారాయణ నీలకంఠలింగ స్వామి ఉయ్యాల శివ,రాహులు ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

