ఇంటర్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందజేత
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఐఐటీ జేఈఈ ఏపీఎంసెట్ నీట్ మొదలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్ను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గద్దె శ్రీనివాస్ దుగ్గిరాల నీరసత్యం చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
కళాశాల డెవలప్మెంట్ చైర్మన్ గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే ఐఐటి జేఈఈ మెటీరియల్ను ఉపయోగించుకుని అందరి విద్యార్థులు మంచి స్థాయికి ఎదిగి కళాశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే అన్ని రకాల సౌకర్యాలను యర్నగూడెం మరియు పరిసర గ్రామ విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవడం కోసం కళాశాలలో జాయిన్ అవ్వాల్సిందిగా విద్యార్థులను శ్రీనివాస్ ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెన్నేటి ఛత్రపతిశివాజీ అధ్యాపకులు పాల్గొన్నారు.