BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

తెలంగాణ
09 Mar, 2026 - 04:41 AM
97 వీక్షణలు
ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష – సోమవారం 352 అర్జీలు స్వీకరణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ప్రజావాణి ద్వారా ప్రజల నుండి వచ్చే దరఖాస్తులకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బాధితుల నుండి అర్జీలను స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. అధికారులు తమ పరిధిలో ఉన్న అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని, ఒకవేళ ఇతర శాఖలకు సంబంధించినవి అయితే వెంటనే సంబంధిత విభాగానికి బదిలీ చేయాలని సూచించారు. మానవీయత చాటుకున్న కలెక్టర్ ప్రజావాణికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల పట్ల కలెక్టర్ మానవీయత చాటుకున్నారు. వారు కూర్చున్న చోటకే స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని దరఖాస్తులను స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 352 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డిఓ మహేశ్వర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. #PrajaVani #Karimnagar #CollectorChitraMishra #PublicGrievances #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube