BREAKING
చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం
www.ntodaynews.com

ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు

తెలంగాణ
31 Oct, 2025 - 07:34 PM
353 వీక్షణలు
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు NTODAY NEWS: తెలంగాణ ప్రజా విజయోత్సవాల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రజా పాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం ఎలా సాధించాం, కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం, భవిష్యత్తు లో తెలంగాణ రాష్ట్రం ఏం సాధించబోతుంది అనే విషయాలను ప్రపంచానికి వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నాం, పెద్ద ఎత్తున MOU లు జరిగేలా వాతావరణం ఉండాలి అన్నారు. దుబాయ్ ఫెస్టివల్ పూర్తిగా దుబాయ్ పట్టణానికి దూరంగా జరుగుతుంది అదే పద్ధతిలో మన రాష్ట్రంలోనూ ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఆలోచన చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు. సీనియర్ మరియు జూనియర్ అధికారులతో కలిపి కమిటీలు వేయాలని ప్రణాళికా ప్రకారం పనులు విభజించుకుని నాణ్యతతో సకాలంలో అనుకున్న ప్రణాళికను అమలు చేసేలా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, మూసి పునర్జీవనం, ఫ్యూచర్ సిటీ, ఇప్పటికే అనేక పరిశ్రమలను తెలంగాణ ఆకర్షిస్తుంది, భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించే విధంగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ రావు, స్పెషల్ సి ఎస్ జయేష్ రంజన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానీయ , వివిధ విభాగాల కార్యదర్శులు, సమాచార పౌర సంబంధాల కమిషనర్ CH.ప్రియాంక, సీనియర్ IAS అధికారులు పాల్గొన్నారు... #Telangana #PrajaVijayotsavam #PublicGovernance #TelanganaRising #FutureCity #Hyderabad #MusiRejuvenation #InvestInTelangana #TelanganaDevelopment #IPRTelangana #TelanganaGovernment #Telangana #PrajaVijayotsavam #IPRTelangana #TelanganaRising Telangana CMO Telangana Digital Media Wing Anumula Revanth Reddy Follow us on Website Facebook Instagram YouTube