ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Spread the love

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ ప్రాథమిక , ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు యువకులతో కలిసి శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ జి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని , ప్రవేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే అనేక అవకాశాలు ఉన్నాయని , అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారని , విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించబడుతుందని , విద్యార్ధుల సర్వతో ముఖాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నదని దీనిని విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ది కోరకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి.గణేష్ , పి. గోపాల్ రెడ్డి , కే.కృష్ణ , స్వర్ణలత తో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు శేఖర్ రెడ్డి , రమేష్ , జ్యోతి, గ్రామ పెద్దలు మడూరి సోమేశ్వరరావు , సామాజిక కార్యకర్త వేముల సైదులు , గ్రామ పంచాయితి సిబ్బంది , జోగు కిషన్ , భాషకర్ల నరేందర్ రెడ్డి , దేవేందర్ , సింహాద్రి ,వేముల లింగస్వామి , వెంకన్న , బోర్రయ్య , గణేష్,నవీన్ , శ్రీధర్ లింగమ్మ ,తదితరులు పాల్గొన్నారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top