శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలో కదిరి మండలంలోని మొటుకుపల్లి కార్యాలయం నందు ఆర్డిటి డైరెక్టర్ మంచో ఫెర్రర్ ని మదర్ థెరిస్సా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేసి శాలువతో సన్మానించడం జరిగింది. తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రతినెల గర్భవతులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని అందిస్తున్న నేపథ్యంలో మంచు ఫెర్రర్ గారిని ఇన్వేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచో ఫెర్రర్ గారు మాట్లాడుతూ యువత ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనమని అన్నారు. సమయం చూసుకొని తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కచ్చితంగా వస్తామన్నారు.
