పేదవారికి అండగా ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్
గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం!
NTODAY NEWS: హైదరాబాద్
పేదరికం, ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండగా నిలుస్తూ ‘రెడీ టు సర్వ్’ ఫౌండేషన్ (Ready to Serve Foundation) విశిష్ట సేవలు అందిస్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి వద్దకు వచ్చిన దాదాపు 300 మందికి పైగా పేదలకు, రోగుల సహాయకులకు కడుపునిండా భోజనం అందించారు.
ప్రతి ఆదివారం హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిరాటంకంగా ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పేదలు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సేవలను కొనసాగిస్తున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ తెలిపారు. ఈ నిరంతర సేవ కార్యక్రమంలో వాలంటీర్లుగా పాల్గొనాలనుకునే వారు లేదా ఈ సేవలకు సహకరించాలనుకునే వారు తమను సంప్రదించవచ్చని ‘రెడీ టు సర్వ్’ నిర్వాహకులు కోరారు.

