భూభారతి చట్టంలో భూ సమస్యల పరిష్కారం– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు.
NTODAY NEWS: వలిగొండ, జూన్ 04
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి గొప్ప వేదిక భూభారతి చట్టం అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. బుధవారం రోజున వలిగొండ మండలం నాగారం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై దరఖాస్తులను పరిశీలించారు. ముఖాముఖి మాట్లాడి,వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ,రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భుభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన,విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల తాసిల్దార్ దశరథమ్,రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.