రోడ్డు భద్రతా ప్రతి ఒక్కరి బాధ్యత — సిఐ కే నాగరాజు
(NTODAY NEWS)
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న వట్టిమర్తి గ్రామంలో నల్గొండ జిల్లా S.P శరత్ శంద్ర పవార్ ఆదేశాల రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిట్యాల పోలీస్ వారి అధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు సీఐ కే నాగరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాలు జరగకుండా రోడ్డు నియమాలను పాటిస్తూ తమ యొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఉంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, అన్నారు. ఈ కార్యక్రమానికి చిట్యాల SI N.ధర్మ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.