కూటమి ప్రభుత్వం ఒక్క హామినీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు..
గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచి ఘోరాతి ఘోరమైన ఓటమిని చవిచూసిందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు విమర్శించారు. ఈనెల 4 న ప్రజా ప్రభుత్వాన్ని (కూటమి ప్రభుత్వం) వ్యతిరేకిస్తూ వెన్నుపోటు దినంగా నిరశన తెలుపుతామని వైసీపీ అధిష్టానం పిలుపు నివ్వడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పేదలకు పింఛన్లు పెంచడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఐదేళ్ళు గడువు పట్టిందని, రాష్ట్రాన్ని, ఆర్థిక అభివృద్ధిని, విధ్వంసకర దుస్థితిలోకి చేర్చిన ఘనత కూడా వైసీపీ వారిదేనన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రరాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నారన్నారు.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడంలో ఆలస్యం అవుతుండడంతో అన్నదాత సుఖీభవ పథకం జాప్యమైందని, పాఠశాలల పునః ప్రారంభానికి ఒకరోజు ముందే తల్లికి వందనం అందజేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. జగన్ రెడ్డి వారి అనుచరులు చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పికొట్టి రాష్ట్ర బంగారు భవిష్యత్తు ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు పాటు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నీ చూసి ఓర్వలేక ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.