www.ntodaynews.com
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్టిఐ కమిషనర్
తెలంగాణ
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆర్టిఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి
NTODAY NEWS:యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట
శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి సోమవారం రోజున దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా గర్భగుడిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. మొదట స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చిన కమిషనర్ కు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డిఓ, తాహసిల్దార్ మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆలయ స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. ఆశీర్వచన మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఏఈవో గజవెల్లి రమేశ్ బాబు, సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫొటోను బహూకరించారు. అనంతరం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యాదగిరి గుట్టలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పీఆర్వో దుడుక రామకృష్ణను ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి పరామర్శించారు. రోడ్డు ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఐజేయూ జాతీయ కమిటీ సభ్యుడు కందుల శ్రీనివాసరావు, తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube