నిత్యవసర సరుకులు అందజేసిన సత్యసాయి భజన మండలి బృందం
NTODAY NEWS:రిపోర్టర్ కూనురు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో వృద్ధునికి నిత్యవసర సరుకులు అందజేశారు. చిట్యాల పట్టణానికి చెందిన కూనూరు నర్సింహ గాయాలపాలై ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బెల్లి సత్తయ్య భజన మండలి వారికి సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు సత్య సాయి భజన మండలి వారు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి ఝాన్సీ చందా నాగలక్ష్మి చందా వెంకటేశ్వర్లు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

