ఆపన్న హస్తం అందజేసిన షామీర్పేట్ పిఎసిఎస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి
NTODAY NEWS: షామీర్పేట్ మండలం
వ్యవసాయ సహకార సంఘం, శామీర్‌పేట్ డైరెక్టర్ జిలకరి విష్ణు ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్రమైన విషాదంలో ఉంది అని,వారి కుమార్తె వివాహం సందర్భంగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులను గుర్తించి పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రామిడి మాధుకర్ రెడ్డి స్వయంగా ముందుకు వచ్చి రూ.50,000/- (యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయం శనివారం రోజున వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ కుటుంబం అనేది కేవలం రాజకీయ బంధం కాదు అని అన్నారు మన సహచరులు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా ఒక్కటిగా ఉంటాం అని అన్నారు ఒకరి బాధ, అందరి బాధ, అదే బీఆర్‌ఎస్ ఆత్మ” అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐయిలయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్స్ భూమి రెడ్డి, బిక్షపతి, నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నర్సింలు, భావాసింగ్, చంద్రకళ, సోసైటీ మాజీ చైర్మన్ వంగ పెంట రెడ్డి, మాజీ సర్పంచులు రాంచంద్రయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, హరిమోహన్ రెడ్డి, ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఆంజినేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

