News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

Smriti Mandhana: ‘మేడం సార్ మేడం అంతే’.. దివ్యాంగ చిన్నారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన స్మృతి మంధాన.. వీడియో వైరల్

Spread the love

మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడే స్మృతి మిథాలీ రాజ్ తర్వాత మహిళా క్రికెట్ కు మరింత వన్నె తెచ్చింది. తన సొగసైన బ్యాటింగ్ తో భారత మహిళా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించింది. ఇక లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన ఆమె ఉమెన్స్‌ ఐపీఎల్‌ 2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విజేతగా నిలిపింది.

స్మృతీ మంధాన.. అటు ఆటతోనూ, ఇటు అందంతోనూ క్రికెట్ అభిమానుల కొల్లగొట్టిన ఈ టీమిండియా క్రికెటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మైదానంలో తన ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడే స్మృతి మిథాలీ రాజ్ తర్వాత మహిళా క్రికెట్ కు మరింత వన్నె తెచ్చింది. తన సొగసైన బ్యాటింగ్ తో భారత మహిళా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించింది. ఇక లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన ఆమె ఉమెన్స్‌ ఐపీఎల్‌ 2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును విజేతగా నిలిపింది. ప్రస్తుతం ఆటతోనే కాకుండా అందంతోనూ అభిమానుల నీరాజనాలు అందుకుంటోన్న స్మృతీ మంధాన తాజాగా తన మనసూ అందమైనదేనంటూ నిరూపించుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ప్రారంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తు చేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. పాక్ తో మ్యాచ్ కంటే ముందు టీమిండియా డ్యాషింగ్ క్రికెటర్ స్మృతిని కలిసేందుకు ఒక దివ్యాంగ చిన్నారి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్మృతి వెంటనే వెళ్లి ఆ చిన్నారిని కలిసింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడింది. ఆ సమయంలో ఆ చిన్నారి ఫ్యాన్‌కు ఏం కావాలో తెలుసుకున్న స్మృతి.. మ్యాచ్‌ తర్వాత మళ్లీ ఆ చిన్నారి ఫ్యాన్‌ను కలిసింది. ఓ సూపర్‌ గిఫ్ట్‌తో తన అభిమాని కళ్లల్లో ఆనందాన్ని నింపింది.

ఇంతకీ ఆ దివ్యాంగ చిన్నారికి స్మృతి మంధాన ఏం గిఫ్ట్‌ ఇచ్చిందో తెలుసా? ఓ స్మార్ట్‌ ఫోన్‌. ఆ ఫోన్‌ అందుకున్న చిన్నారి సంతోషంతో చిరునవ్వులు చిందించింది. తన అభిమాన క్రికెటర్ స్వయంగా ఫోన్ కొని తన చేతుల మీదుగా అందజేయడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేవు. కాగా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌ ఇచ్చిన తర్వాత.. చిన్నారితో కలిసి సరదాగా ఫొటోలు దిగింది స్మృతి మంధాన. కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించి ఆసియా కప్‌ లో బోణి కొట్టింది. నేడు(ఆదివారం) యూఏఈతో టీమిండియా మ్యాచ్‌ ఆడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top