సామాజిక ఉద్యమాలు ఆపలేం!
NTODAY NEWS:- ప్రత్యేక కథనం
డా. సంగని మల్లేశ్వర్
98662 55355
‘మేమెంతో…మాకంత రిజర్వేషన్లు’ అనే న్యాయమైన డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా అటకెక్కింది. ఉద్యమాల అడ్డాలో బీసీలను విస్మరిస్తే.. ఆయా రాజకీయ పార్టీలకు పరాభవం తప్పదని పసిగట్టిన కాంగ్రెస్, కామారెడ్డి డిక్లరేషన్ అమలుగా ఓ స్పష్టమైన సిద్ధాంతంతో జనాభా దామాషా ప్రకారం రిజ ర్వేషన్లు కల్పించాలని నడుం బిగించింది. బీసీ ఉద్యమం అంటే సంక్షేమం, స్కాలర్ షిప్, బస్‌పాస్ అన్న మాదిరిగా సాగినా..
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్భవించిన తెలంగాణ.. దండోరా, బీసీ రిజర్వే షన్ల ఉద్యమాలు ఆయా సంఘాల నాయకత్వాన్ని పతాక శీర్షికన నిలబెట్టింది. అనేక మానవీయ ఉద్యమాలకు అండగా నిలిచింది. అన్ని పార్టీలు బీసీలు, సామాజిక న్యాయం అనే నినాదం జెండా ఎత్తుకోవడం శుభపరిణామం. ఈ మట్టి ఉద్యమ స్ఫూర్తితో తలపండిన ఉద్దండుల నేతృత్వంలో నాడు మండల్ ఉద్యమంతో వచ్చి న చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది.
మూడు దశాబ్దాలుగా సామాజిక ఉద్యమాలకు నెలవుగా అనేక ప్రశ్నలు, పోరాట రూపాలతో రాజకీయ పార్టీలు సైతం రాష్ర్ట బంద్‌లో పాల్గొనేలా చేసింది. ఇప్పుడైతే రాజకీయంగా అణచివేతకు గురవుతున్న బీసీల పక్షాన బలమైన గొంతుకగా మారి రాజ్యాధికార వాటాకోసం కృషి చేయడంలో బీసీలకు ఆయా రాజకీయ పార్టీలు మద్దతుగా నిలుస్తున్నా యి. నాడు జంతర్ మంతర్ కేంద్రంగా చేసిన మహాధర్నా దేశంలో ఒక ప్రకంపనం సృష్టించింది.
ఎలాంటి ప్రలోభాల కు లొంగకుండా సామాజిక ఉద్యమాలకు బీసీ సంక్షేమ సంఘం అండగా నిలుస్తుం ది. ఓ వైపు జాతి ప్రయోజనాల కోసం ఉద్యమిస్తూనే సామాజిక, ఆర్థిక అసమానతల పట్ల నిత్యం చైతన్యం చేసే మేధావులు, బీసీ సంఘాలు చేస్తున్న పోరాటానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని కాంగ్రెస్.. సామాజిక ఉద్యమాల ఊటను ఆపడం ఎవరి తరం కాదని బంద్‌లో పాల్గొని అందరిని ఆశ్చర్యనికి గురిచేశాయి.
మాదిగ దండోరా
నాడు దండోరా.. 32 ఏళ్ల కింద మాదిగల హక్కుల కోసం ఏర్పడిన సంఘం. ఉమ్మడి రిజర్వేషన్లతో అధిక జనాభా గల మాదిగలు నష్టపోతున్నారని ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా ఈదుమూడి లో 14 మందితో పరుడుపోసుకున్న సం ఘం ఇవాళ భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసేంతలా ఓ మహాశక్తిగా తయారైంది. తరతరాలుగా ఓడిపోతున్న జాతిని గెలిపించడానికి జరుగుతున్న మాదిగ దండోరా పోరాటానికి మూడు దశాబ్దాలు కావస్తుంది.
అయినా ఎప్పటికీ నిత్య చైతన్యంతో, రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమం కొత్త పంథాను అందుకుంటూ ఎదుగుతుందే తప్ప, ఎక్కడా తగ్గలేదు. 2000 నుంచి 2004 మధ్యలో చంద్రబా బు ప్రభుత్వం హయంలో ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ర్టంలో అమలు ఫలితంగా మాదిగల్లో వేల మంది ప్రభుత్వ ఉద్యోగా లు పొందగలిగారు. 2004 తర్వాత కేంద్రంలో ఇటు రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన యుపీఏ ప్రభుత్వం వర్గీకరణపై మాట మారుస్తూ కాలయాపన చేస్తూ వచ్చాయి.
మాదిగల ఆకాంక్షే అంతిమ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ బలమైన చైతన్యంతో ఉద్యమిస్తున్న ఫలితంగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన మాదిగ బిడ్డను ఉపకులపతిగా రేవంత్ ప్రభుత్వం నియమించింది. 2014లో తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన మోదీ సర్కార్ పదేళ్ల తర్వాత కానీ, తెలంగాణ నడిబొడ్డున నిర్వహించిన మాదిగల సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
సభలో జన ప్రభంజనాన్ని చూసి వేదికపైనే కృష్ణ మాదిగను మోదీ ఆలింగనం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే మాదిగల ఆకాంక్ష ఎంత బ లంగా ఉందనడానికి ఈ సభ ఒక సాక్ష్యం. మందకృష్ణను జాతీయ నాయకునిగా మోదీ వర్ణించాడంటే ఆ సామాజిక ఉద్య మం ఎంత బలంగా ఉందో చెప్పొచ్చు.
తెలంగాణ ఉద్యమం
1969లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగా ణ ఉద్యమం వ్యూహ లోపం వల్ల ఆకాంక్షలు నెరవేరలేదు. కానీ రావణకాష్టంలా ఆరు దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. నాడు మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో 14 ఎంపీలకు 11 గెలిచినప్పటికీ, ఇందిరాగాం ధీ కనికరించలేదు. అనాటి ఉద్యమ నాయకులను భయంకరంగా బెదిరించినా, పీడీ యాక్ట్ పెట్టినా, ఉద్యోగం తీసేసినా, నెలల తరబడి జైళ్లో పెట్టినా ఎక్కడా రాజీపడలేదు.
అప్పట్లో తెలంగాణ ఉద్యమం పేరె త్తితేనే.. రాజకీయ నిరుద్యోగులని నిందలు వేసిన పరిస్థితి. ఈ కుట్రలను తిప్పి కొట్టడానికే విశ్వవిద్యాలయాల నుంచి ఆచా ర్యులు, విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించే నాటికి పిడికెడు మందే ఉన్నారు. తెలంగాణ పేరెత్తితే నక్సలైట్లు అంటూ ముద్రవేసి నిర్బంధించిన పరిస్థితి. కానీ ఒకప్పుడు తెలంగాణ ఉద్య మం అంటేనే నవ్వులాటగా ఉండేది, ప్రత్యే క రాష్ర్టం ఒక కలగా ఉండేది.
ఆ రోజులు జ్ఞాపకం వస్తే.. కండ్లల్లో నీరు కారకుండా ఉండదు. తదనంతరం పరిణామాల్లో భువనగిరి, సూర్యాపేట, వరంగల్ సభ అనేక సంఘాల కలయిక ఆచార్య జయశంకర్ భావజాల వ్యాప్తి, కేసీఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమ రూపాలు యాది చేసుకుంటేనే ఒళ్లు పులకరిస్తది. తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా ఆచా ర్య కోదండరాం ఒక పిలుపిస్తే లక్షల మం ది రోడ్ల మీదకు వచ్చే రోజులవి.
ఈ మట్టి లో పుట్టిన ఉద్యమం ద్వారా స్వరాష్ర్టం ఏర్పడుతుందని, పదేండ్ల పండుగ జరుపుకుంటుందని ఎవరూ ఊహించలేదు. తొలి దశ 1969 నుంచి 2014 మలిదశ ఉద్య మం వరకు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు విద్యార్థులు పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది.
బీసీలంతా ఏకమై
తెలంగాణ ఉద్యమం వలే శాంతియుత వాతావరణంలో బీసీలంతా ఏకమై అహిం సా మార్గంలో పోరాటానికి సిద్ధం కావాలి. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సరైన వాటా కోసం సాగుతున్న నినాదాలు రాజకీయ పార్టీలకు కునుకులేకుండా చేస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు, మేధావులు, విద్యార్థులు కదం తొక్కడంతో ఖంగుతిన్నారు.
‘అందరు శాఖాహారులైతే రొయ్యల ముల్లు ఎడపోయే’ అన్నట్లు రాష్ర్ట బంద్ విజయవంతం అయ్యింది. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే వరకు విశ్రమించేదిలేదని భీష్మించుకున్న నాయకులకు రాష్ర్టం అంతా మద్దతు దొరికింది. 60 శాతం ఉన్న బీసీలు పార్టీల వైఖరి, తిరకాసు గమనిస్తూ ఒక్కొక్కరి సంగతి తేల్చు కునేందుకు సన్నద్దం అయ్యారు. 78 ఏం డ్లుగా బీసీలకు జరిగిన అన్యాయం ఎదిరించేందుకు 35 బీసీ, ఫూలే,అంబేద్కర్ సం ఘాలు, 136 కులసంఘాల కలిసి బీసీ జాక్‌గా ఏర్పడింది. అయితే ఏ ఉద్యమమై నా ముందుండేది బీసీ బిడ్డలే.
రాష్ర్ట సాధ న ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఆచార్య జయశంకర్ బీసీ బిడ్డ కాదా? మలిదశ ఉద్యమానికి తాను అమరుడై రాష్ట్ర ఆకాంక్షకు ఊపిరి పోసిన కాసోజు శ్రీకాంతాచారి బీసీ బిడ్డ అనేది అబద్దమా? నాడు టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ కోసం చాప వెడల్పు జా గా ఇవ్వడానికి జంకుతున్న రోజుల్లో బహుజన భాంధవుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సర్వం త్యాగం చేయలేదా? ఇప్పుడు జరుగుతున్న బీసీ 42శాతం రిజర్వేషన్ల ఉద్య మానికి రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు ఏదో ఒక రూపంలో అడ్డుతగులుతూనే ఉన్నా యి.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు దిగి రావాలంటే బీసీ సంఘాలు, మేధావులు తమ ఇగోలు పక్కన పెట్టి ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరముంది. రేవంత్ ప్రభు త్వం అఖిలపక్షాన్ని ప్రధాని దగ్గరకు తీసుకెళ్లితే కానీ ‘ఈ మట్టి వాసన’ గొప్పతనం తెలియదు కదా?. పార్లమెంట్‌లో తొమ్మిదొవ షెడ్యూల్ చేర్చి చట్టబద్దత కల్పించేలా ప్రతిపక్ష నేత రాహుల్ ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలి.
బీజేపీ భేషజాలకు పోకుం డా ఎనిమిది మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఆర్డినెన్స్ ఆమోదిస్తే న్యాయపరమైన చిక్కులు ఉండవు, అయితే బీసీలకు రిజర్వేషన్లు ఆయా పార్టీల బిక్షకాదు, రిజర్వేషన్ల వ్యతిరేకులు తెరవెనుక ఎన్ని కుట్రలు చేసినా, అడ్డంకులు సృష్టించినా సామాజిక ఉద్యమాలు ఆపడం ఎవరితరం కాదు.

