శ్రీ వెంకటేశ్వర కళాశాలని వెంటనే ఓపెన్ చేయాలి
ఏలూరు జిల్లా కామవరపుకోట శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఈ సంవత్సరం నుండి అడ్మిషన్ తీసుకోవడం లేదని తల్లిదండ్రులు, విద్యార్థులు వాపోతున్నారు. కామవరపుకోట మరియు భీమడోలు కాలేజీలను తిరుపతి తిరుమల దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కామవరపుకోట కాలేజీలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సంవత్సరం అడ్మిషన్స్ తీసుకోమని, స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకోలేమని చెబుతున్నారని, అడ్మిషన్స్ తీసుకునే సమయంలో ఇలా జరగడం వల్ల అయోమయ పరిస్థితిలో ఉన్నామని స్టూడెంట్స్ వాపోతున్నారు. మాజీ శాసనసభ్యులు, ఘంటా మురళి రామకృష్ణ ఈ విషయం తెలుసుకొని కాలేజీ దగ్గరికి వెళ్లి ఈ సంవత్సరం అడ్మిషన్ ఎందుకు చేయట్లేదు అని అడిగి మరలా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళతానని అన్నారు, ఆయన వెంటనే ఏలూరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ఆర్.ఐ.ఓ ను పంపించడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి. ఈ మండలంలో గవర్నమెంట్ కాలేజీలు గాని ప్రైవేట్ కాలేజీ లు గాని లేవు కనుక ఇక్కడ కాలేజీ నడపవచ్చు అని వారు కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. కనుక విద్యార్థుల సౌలభ్యం కోసం చింతలపూడి శాసనసభ్యులు , సొంగా రోషన్ కుమార్ మరియు ఏలూరు పార్లమెంట్ సభ్యులు, పుట్టా మహేష్ కుమార్, గార్లు జోక్యం చేసుకొని కాలేజీని తిరిగి ప్రారంభించడానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచున్నారు.