విజయవంతంగా ముగిసిన వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం
NTODAY NEWS నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
కునూరు మధు
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో నల్గొండ జిల్లా క్రీడల మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి హాకీ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మే నెల ఒకటో తారీకు నుండి జూన్ 5 వరకు వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం 50 మంది విద్యార్థులతో విజయవంతంగా ముగిసిందని హాకీ కోచ్ గంగపురం రాము తెలియజేశారు ఈ సందర్భంగా హాకీ శిక్షణ తీసుకున్న విద్యార్థులకు చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, కలిసి విద్యార్థులకు హాకీ సాక్స్ ను పంపిణీ చేశారు, వీరితోపాటు హాకీ సీనియర్ క్రీడాకారుడు ఉయ్యాల నరేష్ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, క్రీడల వల్ల పోటీ తత్వం పెరుగుతుందని, వాటితోపాటు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కొండ పరమేష్, ఎలుగు శేఖర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు జనపాల శ్రీను , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, హాకీ సీనియర్ క్రీడాకారుడు బండ్ల నరేష్ , సుంకరి శేఖర్, జనగం స్వామి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.