గ్రంథాలయంలో ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం లోని యర్నగూడెం శాఖా గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బొంతా భరత్ బాబు తెదేపా గ్రామ అధ్యక్షులు బొల్లిన విజయ భాస్కర్ పంచాయితీ కార్యదర్శి ఏ అమ్మిరాజు ఎంపిటిసి గంగవరపు రత్నావతి పాల్గొన్నారు. గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం ద్వారా విద్యార్థుల్లో మరింత సృజనాత్మకత పెరుగుతుందని ప్రతీ ఒక్కరూ విజ్ఞానం పెంపొందేందుకు గ్రంథాలయ సేవలు పొందాలని వక్తలు అన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు బహుమతులను అందించారు. గ్రంథాలయ పాఠకుల సౌకర్యార్థం 30కుర్చీలను సర్పంచ్ భరత్ బాబు బొల్లిన విజయభాస్కర్ అమ్మిరాజు సమకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ అనిత డ్రిల్ మాస్టర్ మరపట్ల మురళి ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు ముంగర అయ్యన్న దుర్గ తదితరులు పాల్గొన్నారు.