ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలి —
జిల్లా కలెక్టర్ హనుమంతరావు
NTODAY NEWS: భువనగిరి పట్టణం,మే 26.
సోమవారం రోజున భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాల లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి రోజు శిక్షణ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమానికి 198 మంది సర్వేయర్లు పాల్గొంటున్నారని , వీరిని మొత్తం 10బ్యాచ్ లుగా చేసి రెండు బ్యాచిలుగా థియరీ కి, 8 బ్యాచిలు క్షేత్ర స్థాయి గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శిక్షణా కార్యక్రమం 50 రోజుల పని దినాలు జరుగుతాయన్నారు. శిక్షణలో భాగంగా సర్వేలో 35 సెక్షన్లు ఉంటాయని వాటికి సంబంధించినవి అన్ని చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అట్టి వాటికి సంబంధించిన వాల్యూంలను జాగ్రత్తగా చదవాలన్నారు. ముఖ్యంగా సర్వేలు ఫీల్డ్ ట్రాకింగ్ చాలా కీలక మైనదని,ఫీల్డ్ లో భాగంగా రకరకాల భూములను సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. సర్వే అనేది జీవితంలో ఒక స్కిన్ లాంటిదని,భూమి సర్వే చేసేటప్పుడు రక రకాలుగా(వంకర టింకరగా) భూమి కొలత ఉంటుందని దానికి అనుగుణంగా రెక్టాంగిల్ , స్క్వేర్ లేదా ట్రయాంగిల్ ఆకారాలను ఉపయోగిస్తూ భూమి సర్వేను సులభంగా చేయవచ్చన్నారు.
అనంతరం సర్వేకు సంబంధించిన మెటీరియల్ ను శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు అందజేశారు.శిక్షణ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి వేణుగోపాల్ రెడ్డి, సర్వేయర్లు పాల్గొన్నారు.