గ్రామీణ రూరల్ మం. లోని అంతర్గాం, ఒడ్డెర కాలని డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన డిజిటల్ హెల్త్ కార్డుల సర్వే లో భాగంగా జిల్లాలో మొదటి గ్రామంగా ఎంపిక చేయబడ్డ ఒడ్డెర కాలనిలో సర్వేలో అధికారులతో కలిసి కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులకు కుటుంబ వివరాలు పక్కాగా నమోదు చేయాలని, […]