తెలంగాణ రైతులను గాలికి వదిలేసారు — మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ మీట్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రతివీటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో దాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారాయి. రోజుల తరబడి కేంద్రాల్లో ధాన్యం పెట్టుకుని రైతులు ఎదురు చూస్తున్నారని కొన్ని కేంద్రాల్లో 20 రోజుల నుంచి నెల రోజులు దాటినా సరే ధాన్యం కొనుగోలు జరగా లేదన్నారు. భూభారతి ఇందిరమ్మ ఇండ్ల లాంటి కార్యక్రమాల పేరుతో అధికారులు రైతులను గాలికి వదిలేసారని లారీ కాంట్రాక్టర్లు సైతం అధికార పార్టీ నేతల అండతో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇక మిల్లుల వద్ద దోపిడీ పెద్ద ఎత్తున కొనసాగుతుందని అన్నారు అంతే కాకుండా కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో వెళ్లిన ధాన్యం దిగుమతి కావాలంటే ఒక్కొక్క క్వింటాలుకు రెండు నుంచి మూడు కిలోల రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్నారని, లేదంటే ధాన్యాన్ని దించకుండా రైస్ మిల్లర్లు జాపం చేస్తున్నారని, దీనివల్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తరుగుకు ఒప్పుకొని నష్టపోతున్నారని, ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు పక్క రాష్ట్రాల నుంచి సన్నధాన్యం తెచ్చి బోనస్ కోసం ఇక్కడ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారని జిల్లాలో పలుచోట్ల సన్నధాన్యం బోనస్ ను కాంగ్రెస్ నేతలు తమ అక్రమార్చనకు అడ్డగా మార్చుకున్నారు అని ఇంకా వానాకాలం బోనసే రైతులకు చెల్లించలేదని ఇటీవల కురిసినకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం రాలేదని ఒక్క నకిరేకల్ నియోజకవర్గంలోనే 900 ఎకరాల్లో నిమ్మ బత్తాయి లాంటి తోటల రైతులు నష్టపోయారు. ఇప్పటివరకు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించే ఊసే లేదన్నారు గత ప్రభుత్వంలో పంట నష్టం జరిగినప్పుడు కేసీఆర్ ఎకరానికి 10000 చొప్పున పరిహారం అందించారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలు చూడటం లేదని మంత్రులంతా తమ సంపాదనలో పడ్డారు కమిషన్లు కోట్ల రూపాయలు వచ్చే పనుల కోసమే మంత్రులు చూసుకుంటున్నారని అన్నారు. మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు కానీ నాకు డబ్బులు అవసరం లేదు ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించమని అనడం కొండా సురేఖ మాటలు అందుకు నిదర్శనం అన్నారు. నేటికి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్న ఒక్క కొత్త పని ప్రారంభించలేదని, టిఆర్ఎస్ టైంలో చెప్పిన పనులను కూడా కొనసాగించలేకపోతున్నారని, ఇప్పటికీ నియోజకవర్గాల అభివృద్ధి ఫండ్ ఒక పైసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అన్ని రంగాలను కుదేలు చేసింది. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ ను తీవ్రంగా దెబ్బతీసిందని, మూసి ప్రక్షాళన ఒక అడుగు కూడా ముందుకు స్వాగతం లేదని సీఎం రేవంత్ రెడ్డి చేతిలో రాష్ట్రంలో పాలన పిచోడి చేతిలో రాయిలా మారింది అని తీవ్రంగా ధ్వజమెత్తారు.