తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని. సిపిఐ జాతీయ కార్యదర్శి Ex MP సయ్యద్ అజీజ్ పాషా డిమాండ్ చేశారు.
NTODAY NEWS: ఎల్బీనగర్
సిపిఐ సరూర్నగర్ మండలసమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ లో జరిగిన సమావేశానికి సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అజీజ్ పాషా, హాజరై ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరితో పాటు తెలంగాణ ప్రాంత విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మట్టి మనుషులంతా ఏకమైన దోరలు, భూస్వాములు, జాగీర్‌దార్లును గడిల బద్దలు కొట్టి వారిని తరిమి తరిమి కొట్టి మహోత్తర ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటామని, ఆలాంటి వీర తెలంగాణ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు అందించాల్సి ప్రభుత్వాలు సమైక్య దినోత్సవమంటూ, ప్రజా పాలన దినోత్సమంటూ రకరకాల పేరులతో వేడుకలు జరపడంమేమిటని ప్రశ్నించారు. నాటి సాయుధ పోరాటమే లేకపోతే నేడు తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదని గుర్తుంచు కోవాలన్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరుతో ఉత్సవాలు నిర్వహించాలని సాయుధ అనే పేరు పలకేందుకు భయముంటే తెలంగాణ రైతాంగ పోరాటంపేరుతోనైనా ఉత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికే మంచి పేరు, గుర్తింపు వస్తుందని సూచించారు. అదేవిధంగా నాటి సమర యోధుల త్యాగాలతో పాటు వారి చరిత్ర భావి తరాలకు అందించేందుకు రాష్ట్ర రాజదాని కేంద్రమైన హైదరాబాద్‌లో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు ఈ పోరాటానికి న్యాయకత్వం వహించిన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, అరుట్ల రామచంద్రారెడ్డి, చాకలి ఐలమ్మ కమలాదేవి, ధర్మ భిక్షం లాంటి మహానేతల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై కాని ప్రధాన ప్రాంతాల్లో కాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఓ చరిత్ర అని, ఈ పోరాటాన్ని బిజెపి హిందూ, ముస్లింల మధ్య ఘర్షగా వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని అగ్రహాం వ్యక్తం చేశారు. నాడు అన్ని వర్గాల పేద ప్రజలను హింసిస్తున్న ధనిక వర్గాలకు వ్యతిరేకంగా జరిగిన వర్గ పోరాటమని పేర్నొన్నారు. నాడు ఈ మహోత్తర సాయుధ పోరాటం జమిందార్లు, భూస్వాములు, జాగీర్‌దార్లకు వ్యతిరేకంగా జరిగిందని, వీరిలో 90 శాతానికి పైగా హిందువులే ఉన్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఇస్కప్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ గోపాల్. సిపిఐ. ఎస్ టి యు తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కర్ణాకర్ రెడ్డి. సిపిఐ రంగారెడ్డి జిల్లా సమితి సభ్యులు జిల్లాల కృష్ణ. మహబూబ్. కమలమ్మ. రమావత్ సక్రు నాయక్. సిపిఐ నాయకులు వర్రే ఇస్తారు సాహెద్. ఇది బాయ్ నూర్జహాన్. నరసమ్మ. బస్తీ వాసులు పాల్గొన్నారు.













