జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం

Spread the love

జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

NTODAY NEWS: జనగామ జిల్లా, జూన్ 02
జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.ముందుగా కలెక్టర్ రిజ్వాన్ పాషా ,ఇతర అధికారులు పువ్వుల బొకే తో స్వాగతం పలికారు. ఆతర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అమరవీరుల స్థూపం వద్ద పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమంపై సందేశాన్ని జనగామ జిల్లా ప్రజలకు అందజేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అధికారులకు నిర్వహించిన క్రీడా పోటీలకు సంబంధించిన బహుమతులను అందజేశారు. అదే విధంగా సీఎం కప్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అవార్డులు అందజేశారు. పలువురికి ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన ఉత్తర్వులను అందజేసారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమాలను వీక్షించి వారిని అభినందించారు ఏర్పాటు చేసి స్టాల్స్ ని వీక్షించారు.ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుచున్న విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, పా సమరయోధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలిపారు. దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఆరు దశాబ్దాల పోరాటం, అ త్యాగాల ఫలంగా 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు. ప్రపంచం నలుమూలలో ఉన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా వారందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగా రైజింగ్-2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యానిక తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందించడంతో పాటు జిల్లాలో జరిగే వివిధ కార్యాక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడంలో జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేసిందని. గత సంవత్సరం ఆగష్టు 29 న జిల్లాలో జరిగిన గవర్నర్ గారి పర్యటన, ఈ సంవత్సరం మార్చి 16 న స్టేషన్ ఘనపూర్ లో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రగతి బాట కార్యాక్రమాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను భాధ్యతాయుతంగా నిర్వహించి విజయవంతం చేశారన్నారు.జిల్లాలో వివిధ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసేందుకు నిరంతరం సమీక్షలు, పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ కి,అదనపు జిల్లా కలెక్టర్ల కు శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమవుతున్న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ కు,ఇతర పోలీస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారికి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడపకు చేరేలా తమ వంతు సహకారం అందిస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల,బాలికలకు ఆశీస్సులు.అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top