సమస్యలు ఉంటే చెప్పండి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము
ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం అంకన్న గూడెం గ్రామంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులను కలిసి మాట్లాడుతూ సమస్య ఏదైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. పంచాయితీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో చేసిందని అందులో భాగంగా గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం 80 లక్షల వ్యయంతో పంచాయతీలో వేయడం జరిగిందని తెలిపారు. పోలవరం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జీలుగుమిల్లి మండలానికి ఏడు కోట్ల నిధులు తీసుకువచ్చారని ప్రత్యేకంగా అంకన్నగూడెం పంచాయతీకి 80 లక్షల వ్యయం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్యే గారికి అంకన్నగూడెం పంచాయతీ పై ప్రత్యేక అభిమానం ఉందని గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది.