కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి —-ఎం ఎల్ సి సత్యం
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాoపల్లి గ్రామంలోని అమరజీవి గోపగొని నరసింహ ప్రాంగణం (జిఎస్ కే ఫంక్షనల్ )లో చిట్యాల మండల సిపిఐ 7వ మహాసభ నిర్వహించారు ఈ మహాసభకు ఎం.ఎల్.సి సత్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహాసభలో సిపిఐ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను, అంతరంగిక భద్రత విషయంలో అమెరికా అధ్యక్షులు ట్రంపు జోక్యం చేసుకోవడం సరైనది కాదని విమర్శించారు. టెర్రరిజం పేరుతో భారతదేశాన్ని ఇబ్బందుల పాలు చేసే చర్యలను దేశం యావత్తు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని రిలయన్స్, ఆదాని అంబానీ లకు కట్టబెడుతూ ప్రైవేట్ పరం చేయడం జరుగుతుందని అన్నారు. సామాన్యులు, పేదలు వాడే నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను జిఎస్టి పేరుతో పన్నులు వేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతంగం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కార్మిక చట్టాలను మార్పులు చేస్తూ ప్రజా హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను మార్పులు చేస్తూ కార్పొరేట్ వర్గాలకు వత్తాసు పలుకుతున్న నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు జులై 9న సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నకేరేకల్ నియోజకవర్గంలో సాగునీరు అందించే బి వెల్లంల, ఫిలాయి పల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు అనుసంధాంగా ఉన్న బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తిచేసి చిట్యాల ప్రాంతం రైతాంగానికి సాగునీరు అందించాలన్నారు. ఆరు కాలాలు కష్టపడి పండించిన రైతులకు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులకు కొరివిలు పెడుతున్న ఇబ్బందులను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలలో ప్రతి గ్రామంలో పియుపి నుండి వెహికల్ అండర్ ప్రాసింగ్ (వి.యూ.పి )నిర్మాణం చేపట్టి జాతీయ రహదారి పనులు,సర్వీస్ రోడ్డు పనులను త్వరితరగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు కీలక పాత్ర పోషించిన కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది కళాకారులు జీవనోపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని అర్హులైన పేద కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని పెన్షన్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మహాసభకు సిపిఐ మండల సహాయ కార్యదర్శి జిల్లా సత్యం అధ్యక్షత వహించగా గీత పనివారల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగె సైదులు, సిపిఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్, జిల్లా యాదయ్య ఎస్ కే షరీఫ్, సీమ అంజయ్య,కేతరాజు అంజయ్య,దేశగాని బాలరాజు, గుండాల సత్తయ్య, జిల్లా లక్ష్మయ్య దేవేందర్ గోపగోని శేఖర్,బొడిగె బక్క శెట్టి, పానుగుల శివ, నర్రా శేఖర్ రెడ్డి దూదిగాని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.