ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఎదగాలి. — ఎస్ ఎస్ టి సి ఎఫ్ ఎల్ (SST CFL) మండల కోఆర్డినేటర్ ఎల్లబోయిన విశ్వనాథ్..
NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 07
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలందరూ పొదుపు, బడ్జెట్ నిర్వహణ ప్రణాళికల ద్వారా ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సమాజంలో ఎదగాలని ఎస్ ఎస్ టి సి ఎఫ్ ఎల్ మండల కోఆర్డినేటర్ ఎల్లబోయిన విశ్వనాథ్ అన్నారు. శనివారం మండలంలోని చౌదర్ పల్లి గ్రామ పంచాయతీ వద్ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ (SST)సంస్థ ఆధ్వర్యంలో “ఆర్థిక అక్షరాస్యత పై కళాజాత”, మ్యాజిక్, పాటలచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్య ,పేద తరగతి చెందిన ప్రజల సంక్షేమానికై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి సురక్ష బీమా, జీవన్ జ్యోతి, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలను కలిగి ఉండాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తి కుటుంబాలకు ఆర్థిక అండగా బీమా పథకాలు నిలుస్తాయన్నారు.దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్ మోసాల ద్వారా ఖాతాదారులు ఎక్కువగా నష్టపోతున్నారని సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ కార్డ్, ఈశ్రమ్ కార్డు లను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. బ్యాంకుల అందించే సేవలను వివరించారు. అంతకుముందు కళాజాత బృందం చే నిర్వహించబడిన మ్యాజిక్ షో అలరించాయి. ఈ కార్యక్రమంలో కీసర ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ఉమామహేశ్వరి ,భాను , కళాకారులు విజయ్ బృందం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.