BREAKING
తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు
www.ntodaynews.com

రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
13 Jun, 2025 - 09:10 AM
305 వీక్షణలు
రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: భువనగిరి భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కరమవుతాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొని భూభారతి రెవెన్యూ సదస్సు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. భూ భారతి రెవిన్యూ సదస్సు లో రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న నూతన భూభారతి రెవెన్యూ చట్టం 2025, రెవెన్యూ గ్రామసభల పై రైతులు ప్రత్యేకంగా అవగాహన పెంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సదస్సులను పక్కాగా వినియోగించుకోవాలన్నారు, అధికారులు పహానీ లతో రెవెన్యూ సదస్సులకు హాజరయ్యి సమస్యలు పరిష్కార దిశగా రైతులకు అవగాహన పరచడం జరుగుతుందన్నారు.  అందుకనుగుణంగా దరఖాస్తులను పూర్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ ద్వారా సహకరిస్తున్నామని అనంతరం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని రైతులకు తెలియజేశారు.భూ భారతి చట్టంలో రైతుల భూముల సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయని రైతులకు తెలియజేశారు. దరఖాస్తు చేయడం కోసం వచ్చే వారికి హెల్ప్ డెస్క్ లు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని రైతులకు తెలియజేశారు.రైతుల సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమం లో రెవిన్యూ అధికారులు, సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube