బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలి, ప్రజా ప్రభుత్వంలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం– శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
79వ, భారత స్వాతంత్ర్య దినోత్సవము సందర్భంగా శుక్రవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధి హోదాలో పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రియమైన స్వాతంత్ర్య సమర యోధులకు, అమర వీరుల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, కర్షక, కార్మిక, పాత్రికేయులకు, విద్యార్థినీ విద్యార్థులకు 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ చరిత్రలో ఆగష్టు,15 కు విశిష్టస్థానం ఉంది అని,రెండు వందల సంవత్సరాల పాటు ఆంగ్లేయుల నిరంకుశ పాలనలో ఉన్న మన జాతి స్వేఛ్ఛా వాయువులను పీల్చిన రోజు ఈరోజు అని అన్నారు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా, తర్వాత తరం వారైనా బానిస బ్రతుకులు అనుభవించకుండా స్వతంత్ర జీవితాన్ని అనుభవించాలనే మహాశయంతో స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహానుభావులు సమిధలైనారు అని అన్నారు ఈ పవిత్రమైన రోజున ఆ త్యాగధనులoదరికి నా జోహార్లు అర్పిస్తున్నాను అని అన్నారు అట్టి మహనీయుల ఆదర్శాల స్పూర్తితో వారి అడుగు జాడలలో పయనిస్తూ పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజo చేయాలని కోరుతున్నాను అని అన్నారు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పధకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను అని అన్నారు
ఆడబిడ్డలకు అండదండలు
• ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది అని, అందుకే రాష్ట్రంలో కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది అని అన్నారు.
• ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది అని, ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి అని అన్నారు రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది అని అన్నారు.
• ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం, 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలతో విద్యుత్ ప్లాంట్లు, మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళాశక్తి క్యాంటీన్లు మొదలగు కార్యక్రమాలతో మహిళలకు అండదండలు అందిస్తున్నాము అని అన్నారు. • మహా లక్ష్మి పధకం ద్వారా జిల్లాలో RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, LPG సబ్సిడీపై వంట గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకు, గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా జీరో బిల్ ఇవ్వడం జరుగుచున్నది అని,ఈ పథకాల ద్వారా జిల్లాలో మహిళలకు 217 కోట్ల రూపాయల లబ్ది చేకూర్చనైనది అని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం
• తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం అని అన్నారు అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం అని అన్నారు
• గ్రీన్ ఛానెల్ లో నిధులు విడుదల చేస్తున్నాం. ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నాం అని అన్నారు.
• జిల్లాలోని 5 నియోజికవర్గాలలో 9 వేల 398 లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయగా, వీటిలో 7 వేల 542 మంది లబ్దిదారులు ముగ్గులు పోసుకొని ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.ఇట్టి ఇండ్లకు నిర్మాణ దశను బట్టి 47 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశాం అని అన్నారు.
నిరుపేదలకు సన్నబియ్యం మరియు నూతన రేషన్ కార్డుల మంజూరు :
• 70 ఏళ్లుగా PDS వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది అని,13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం అని అన్నారు.
• రేషన్ కార్డు… ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక అని అన్నారు ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం అని అన్నారు పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది అని అన్నారు.
• మన జిల్లాలో నూతన రేషన్ కార్డుల మంజూరి ప్రక్రియ జరుగుచున్నది, జిల్లాలో 23 వేల 367 నూతన కార్డులు ఇవ్వడం జరిగింది అని అన్నారు దీని ద్వారా 71 వేల 530 మందికి లబ్ది చేకూర్చనైనది అని, గతంలో ఉన్న రేషన్ కార్డులలో అదనముగా 63 వేల 965 మంది సభ్యులను చేర్చడం జరిగింది అని అన్నారు.
వ్యవసాయ శాఖ:
• గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం అని అన్నారు రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా… రైతుల విషయంలో రాజీ పడలేదు అని అన్నారు తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం అని అన్నారు.
• రైతు నేస్తం కార్యక్రమము ద్వారా రాష్ట్రము లోని అన్ని రైతు వేదికల ద్వారా శాస్త్రవేత్తల సలహాలను, సూచనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం ప్రారంభించాము అని అన్నారు.
• రైతుభరోసా పథకం క్రింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం అని అన్నారు జూన్ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం అని అన్నారు రాష్ట్రంలోని 70 లక్షల,11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించాం అని,కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం అని అన్నారు.
• ఈ ఆర్ధిక సంవత్సరoలో 2 లక్షల 33 వేల 418 మంది రైతులకు 306 కోట్ల 47 లక్షల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడము జరిగింది అని అన్నారు.
• జిల్లాలో “రైతు బీమా” పథకం క్రింద 1 లక్షా 36 వేల మంది నమోదు చేయడం జరిగిందన్నారు ఇందులో మరణించిన 588 మంది రైతుల కుటుంబాలకు 29 కోట్ల 40 లక్షల రూపాయలు బీమా నగదు జమ చేయడం జరిగింది అని ,ప్రస్తుతం రైతు బీమా రెన్యువల్ పూర్తి అయినది అని, కొత్తగా 12 వేల మంది రైతులు నమోదు చేసుకున్నారు అని అన్నారు.
• 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం అని అన్నారు సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నాం అని,ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం అని అన్నారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం అని అన్నారు.
• ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అని అన్నారు.
• జిల్లాలో 2024-25 యాసంగి సాగుకు సంబంధించి 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 74 వేల 728 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను 43 వేల 128 రైతుల నుండి కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి వారికీ 865 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది అని అన్నారు.
ఉద్యానవన శాఖ:
• మన జిల్లాలో 23 వేల 921 ఎకరాలలో ఉద్యాన మరియు మల్బరీ పంటలు సాగులో ఉన్నవి అని అన్నారు
• మన జిల్లాలో గత మూడేళ్ళలో 4 వేల 500 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును చేపట్టడం జరిగింది అని అన్నారు పంట కోతకు వచ్చిన 50 ఎకరాల నుండి గెలెలు కోసి మిల్లులకు పంపడం జరిగింది అని, ఈ సంవత్సరములో 3 వేల 500 ఎకరాల కొత్త తోటల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 330 ఎకరాలలో మొక్కలు నాటడం పూర్తి అయినది అని అన్నారు.
రెవెన్యూ శాఖ
• భూసమస్యల పరిష్కారం కొరకు భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాము అని అన్నారు జిల్లాలోని 17 మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాము అని, జిల్లాలో 1 వేయి 775 సమస్యలను పరిష్కారం చేయదగినవిగా గుర్తించి, ఇందులో 1 వేయి 200 సమస్యలను పరిష్కారించాము అని అన్నారు ఇతర సమస్యల పరిష్కార ప్రక్రియ కొనసాగుచున్నది అని అన్నారు.
• ఈ సంవత్సరములో కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం ద్వారా 3 వేల 520 మంది లబ్దిదారులకు 35 కోట్ల 26 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందచేశాము అని అన్నారు.
ఎస్సీవర్గీకరణతో సామాజిక న్యాయం
• సంక్షేమంతోపాటు సామాజికన్యాయంలో సయితం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది అని,దేశంలో ఎస్సీవర్గీకరణ చేసిన తొలిరాష్ట్రం తెలంగాణ అని అన్నారు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్- 1 లో 15, గ్రూప్ -2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం అని అన్నారు.
• షెడ్యూల్ కులాల విద్యార్థుల కొరకు మన జిల్లాలోని (18) ప్రీ మెట్రిక్ మరియు (2) పోస్టు మెట్రిక్ వసతి గృహములలో 1 వేయి 718 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రవేశం కల్పించడం జరిగినది అని అన్నారు.
• పోస్టు మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనముల ద్వారా 2025-26 సంవత్సరoలో 3 వేల 527 మంది విద్యార్థినీ, విద్యార్థులకు 1 కోటి 3 లక్షల రూపాయలు మంజూరి చేయనైనది అని అన్నారు.
• అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి క్రింద ఈ ఆర్ధిక సంవత్సరoలో 10 లక్షల 62 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని అన్నారు.
వెనుకబడిన తరగతుల అభివృద్ధి:
• పారదర్శకంగా కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అని అన్నారు.
• జిల్లాలో ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ 18 వసతి గృహములలో 1 వేయి 70 మంది విద్యార్థులకు వసతి కల్పించడం జరుగుతుందన్నారు 2025-26 సంవత్సరoలో వసతి గృహల నిర్వహణకు 50 లక్షల 82 వేల రూపాయల నిధులు ఖర్చు చేయడం జరిగినది అని అన్నారు.
• విదేశాలలో ఉన్నత విద్య చదువుకొనుటకు ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు మహాత్మ జ్యోతిభాపూలే బి.సి ఓవర్సీస్ విద్యా నిధి పధకం ద్వారా 20 లక్షల రూపాయలు అందచేయడం జరుగుతుంది అని,విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాం అని అన్నారు.
• 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం అని, జిల్లాలో ఆలేరు మరియు భువనగిరి శాసనసభ నియోజక వర్గాల పరిదిలో 400 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళను మంజూరీ చేయడం జరిగింది అని అన్నారు.
నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి:
• తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం అని అన్నారు కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే… శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది అని అన్నారు.
గంధమల్ల జలాశయం:
• జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన గంధమల్ల జలాశయo నిర్మాణము కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, శంకుస్థాపన చేశారని ఇట్టి జలాశయ నిర్మాణము 1.41 TMC ల నీటి సామర్థ్యంతో 358 కోట్ల 16 లక్షల రూపాయలతో ఒప్పందం చేయడం జరిగింది. ఇట్టి జలాశయo భూ సేకరణ పనులు పురోగతిలో ఉన్నవి అని అన్నారు.
• ఈ ప్రాజెక్ట్ క్రింద ఆలేరు నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టు మరియు 50 చెరువులను నింపడానికి వీలవుతుంది అని అన్నారు.
భునియాదిగాని, పిల్లాయిపల్లి మరియు ధర్మారెడ్డి కాలువలు:
• భునియాదిగాని కాలువ నిర్మాణము పూర్తి చేయుటకు 195 కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగింది. ఈ కాలువ ద్వారా 14 వేల 575 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తుంది మరియు చెరువుల క్రింద 6 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అని, భూసేకరణ వివిధ దశలలో ఉన్నది అని అన్నారు.
• పిల్లాయిపల్లి కాలువ నిర్మాణము పూర్తి చేయుటకు 58 కోట్ల 30 లక్షల రూపాయలతో ఒప్పందం జరిగింది. ఈ కాలువల యొక్క పనులు పురోగతిలో ఉన్నవి ఈ కాలువ ద్వారా 16 వేల 525 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి లోకి వస్తుంది. మరియు సుమారు 84 చెరువుల క్రింద 6 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అని అన్నారు.
• ధర్మారెడ్డి కాలువ నిర్మాణము పూర్తి చేయుటకు 84 కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగింది, పనులు పురోగతిలో ఉన్నవి ఈ కాలువ ద్వారా 12 వేల 661 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి లోకి వస్తుంది అని, మరియు 5 వేల 126 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అని అన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ,
చేయూత:
• మన జిల్లాలో వృద్దాప్య, వితంతు,వికలాoగుల,కల్లుగీత, చేనేత,ఒంటరి మహిళలు మరియు బీడి కార్మికులు మొత్తం 99 వేల 380 మంది లబ్దిదారులకు నెలకు 25 కోట్ల 24 లక్షల రూపాయల పెన్షన్ ను పంపిణి చేయడము జరుగుచున్నది అని అన్నారు.
• జిల్లాలో జాతీయ కుటుంబ సంక్షేమ నిధి పధకం ద్వారా 1 వేయి 84 మంది లబ్దిదారులకు 2 కోట్ల 16 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు.
• మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 14 లక్షల 57 వేల పని దినాలు కల్పించి 61 కోట్ల 67 లక్షల రూపాయలు ఖర్చుచేయనైనది అని అన్నారు.
స్వయం సహాయక సంఘాలు:
• ఈ ఆర్ధిక సంవత్సరములో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఋణాల పంపిణి కార్యక్రమం క్రింద 611 కోట్ల 17 లక్షల లక్ష్యం నిర్ణయిoచగా ఇప్పటివరకు 189 కోట్ల 52 లక్షల ఋణ సదుపాయం కల్పించడమైనది అన్నారు.
• మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్త్రీ నిధి పధకం ద్వారా 475 స్వయం సహాయక సంఘాలకు 13 కోట్ల 38 లక్షల రూపాయలు మంజూరి చేయడము జరిగింది అని అన్నారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా):
• జిల్లాలోని (6) మున్సిపాలిటీలలోని మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా ఈ సంవత్సరoలో ఇప్పటి వరకు 361 స్వయం సహాయక సంఘాలకు 51 కోట్ల 53 లక్షల రూపాయలు మంజూరి చేయడము జరిగింది మరియు స్త్రీ నిధి పధకం ద్వారా 623 స్వయం సహాయక సంఘాలకు 6 కోట్ల 17 లక్షల రూపాయలు మంజూరి చేయడము జరిగింది అని అన్నారు.
జిల్లా పంచాయితీ శాఖ:
• ఈ ఆర్ధిక సంవత్సరములో రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు ద్వారా 1 కోటి 68 లక్షల రూపాయలు జిల్లాలోని గ్రామ పంచాయితీలకు జమ చేయడం జరిగింది అని అన్నారు.
గిరిజన సంక్షేమము :
• జిల్లాలో 8 గిరిజన వసతి గృహాలలో 694 మంది విద్యార్ధులు వసతి పొందుతున్నారు అని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ క్రింద 1 వేయి 64 విద్యార్ధినీ విద్యార్ధులకు 96 లక్షల 88 వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడము జరిగినది అని అన్నారు.
• అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి క్రింద ఇద్దరు గిరిజన విద్యార్దులకు 20 లక్షల రూపాయలు మంజూరీ చేయడమైనది అని అన్నారు.
మైనారిటీల సంక్షేమ శాఖ:
• జిల్లాలో 06 మైనారిటీ గురుకుల మరియు జూనియర్ కళాశాలలో 1100 మంది విద్యార్థులకు విద్యాబోధన జరుగుచున్నది అని అన్నారు.
• ఈ సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ద్వారా 460 మంది మైనారిటీ విద్యార్థులకు ఒక కోటి 30 లక్షల రూపాయలు మంజూరు చేయడము జరిగినది అని అన్నారు.
• రంజాన్ పండుగ 2025 సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మరియు ఆలేరు నియోజక వర్గాలకు 5 లక్షల రూపాయలతో పేద ముస్లింలకు దావత్ ఎ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడము జరిగినది అని అన్నారు.
మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ:
• జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేయుచున్నవి అని అన్నారు.
• ఆరోగ్య లక్ష్మి పధకం ద్వారా 3 వేల 680 మంది బాలింతలకు, 4 వేల 219 మంది గర్భవతులకు మరియు 12 వేల 420 మందికి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పోషక ఆహారం అందిస్తున్నాము అని అన్నారు.
సంక్షేమ వసతి గృహాలు:.
• ప్రభుత్వ వసతి గృహాలలో నివశిస్తున్న బాల బాలికలకు డైట్ ఛార్జీలు 40 % మరియు కాస్మోటిక్ ఛార్జీలు 200 % పెంచడం జరిగింది అని అన్నారు జిల్లాలో 95 ప్రభుత్వ వసతి గృహాలలో జిల్లా స్థాయి అధికారులు దత్తత తీసుకొని ప్రతి నెల వసతి గృహాలలో వినూత్నముగా నిద్ర చేయడం మరియు వసతి గృహాలలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుంది అని, ప్రతి ప్రభుత్వ వసతి గృహాలకు కామన్ మెనూ విధానమును పాటించడం జరుగుతుంది అని అన్నారు.
విద్యా శాఖ:
• జిల్లాలో మార్చ్ 2025 లో జరిగిన 10 వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత 97.8 % కాగా, 159 పాఠశాలలు 100 % ఉత్తీర్ణత సాదించి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 7వ స్థానం సాధించడం జరిగింది. జిల్లాలోని ఈ విద్యా సంవత్సరం నూతన నమోదు గణనీయంగా పెరిగి 5 వేల 800 మంది పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం జరిగినది అని అన్నారు.
వైద్య మరియు ఆరోగ్య శాఖ:
• 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం అని అన్నారు రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం అని అన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం అని తెలిపారు.
• ఆరోగ్య మహిళా క్లినిక్స్ ద్వారా 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఇప్పటి వరకు 50 వేల 614 మందికి సేవలు అందించబడినవి అని అన్నారు.
• టి-హబ్ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా జనవరి 2025 నుండి 42 వేల 349 మంది రోగులకు 1లక్షా 64 వేల 57 రక్త పరిక్షలు ఉచితంగా చేయడం జరిగింది అని అన్నారు.
• పాఠశాల ఆరోగ్య కార్యక్రమము ద్వార హాస్టల్ విద్యార్ధులకు ప్రతి నెల మెడికల్ క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సలు నిర్వహించి అవసరమైన మందులు ఇవ్వడం జరిగినది మరియు అవసరమైన వారికి రక్త పరీక్షలు చేయడం జరిగింది అని అన్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకం:
• “రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం” ద్వారా బీ.పి.ఎల్ కుటుంబాలకు మెరుగైన కార్పొరేట్ ఆరోగ్య బీమా సహాయాన్ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెoచడం జరిగింది అని, ఈ పథకం లో 1వేయి 672 వ్యాధులకు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా చికిత్సలు మరియు శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుంది అని అన్నారు.
• మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 14 వేల 986 మందికి శస్త్ర చికిత్సలకు 40 కోట్ల 52 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
గ్రామీణ నీటి సరఫరా శాఖ:
• జిల్లాలో మంచి నీటి సరఫరా మెరుగు పరుచుటకు 210 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఘనపూర్ గుట్ట వద్ద మంచినీటి పైప్ నిర్మాణం జరుగుతుంది అని, దీని ద్వారా రానున్న రెండు నెలల్లో జిల్లాలో మంచినీటి సరఫరా మెరుగు పడుతుంది అని అన్నారు.
• త్రాగు నీటి ఎద్దడి నివారణ కొరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు తమ ప్రత్యేక నిధుల(SDF) నుండి 2 కోట్ల 45 లక్షల రూపాయల నిధులు మరియు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్(DMFT) నుండి 1 కోటి 41 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో నీటి ఎద్దడి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవటం జరిగింది అని అన్నారు.
అటవీ శాఖ:
• వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 20 లక్షల 53 వేల మొక్కలు నాటుట లక్ష్యము కాగా 15 లక్షల 42 వేల మొక్కలు వివిధ శాఖల ద్వారా జిల్లా వ్యాప్తoగా నాటడమైనది అని అన్నారు.
• 53 అటవీ బ్లాకులు ఉండగా ఇందులో 10 అటవీ బ్లాకులు ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్బన్ లంగ్ స్పేస్ అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్ధం ప్రారంబించుట జరిగినది అని అన్నారు.
పశుసంవర్ధక శాఖ:
• ఈ ఆర్ధిక సంవత్సరములో కేంద్ర ప్రభుత్వ మినీ కిట్ పధకం ద్వారా 75 % సబ్సిడీ పై 4 లక్షల 98 వేల రూపాయలతో 6.75 టన్నుల విత్తనములు రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఆలేర్ మరియు భువనగిరి నియోజకవర్గ పరిధిలో రెండు సంచార పశు వైద్య శాలలు 1962 టోల్ ఫ్రీ నెంబర్ తో నిరంతరంగా రైతులకు ఇంటి ముంగిట సేవలు అందిస్తున్నాయి అని అన్నారు.
చేనేత మరియు జౌళి శాఖ:
• తెలంగాణ ప్రభుత్వo 2025-26 మరియు 2026-27 సంవత్సరములలో చేనేత మరియు అనుబంధ కార్మికుల కోసం ‘’ నేతన్నకు పొదుపు” పథకాన్ని ఏప్రిల్ 2025 నుండి అమలు చేసింది. ఈ పధకం ద్వారా 10 వేల 790 మంది చేనేత మరియు అనుబంధ కార్మికులు నమోదు చేసుకోగా 2 కోట్ల 17 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది అని అన్నారు.
• నేతన్నకు భీమా పథకములో ఆర్హులైన 10 వేల 686 మంది చేనేత కార్మికులను చేర్చడం జరిగింది అని,వివిధ కారణాలతో మరణించిన 135 మంది నేత కార్మిక కుటుంబాలకు 6 కోట్ల 75 లక్షల రూపాయలు నామినీలకు లబ్ది చేకూర్చడం జరిగింది అని అన్నారు.
• ఆగష్టు 7, 2025 న జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా ఈ సంవత్సరము (05) మంది చేనేత కార్మికులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ఇవ్వడం జరిగింది అని అన్నారు.
విద్యుత్ శాఖ:
• నూతనoగా 33/11 KV ఉప విద్యుత్ కేంద్రము నారాయణపూర్ మండలo లచ్చమ్మగూడెం గ్రామములో తేది 05 ఆగష్టు 2025న ప్రారంభించబడినది మరియు నారాయణపూర్ మండలo చిమిర్యాల గ్రామము మరియు చౌటుప్పల్ మండలములో యనగంటి తండాలలో శంకుస్థాపన చేయబడినది అని అన్నారు.
రోడ్లు మరియు భవనాలు:
• రాష్ట్ర ప్రణాళిక నిధుల క్రింద 9 రోడ్లు పనులు మరియు 4 వంతెనలు 544 కోట్ల 18 లక్షల రూపాయలతో 122.70 కి.మీ మంజూరై 86.60 కి.మీ పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి అని అన్నారు.
• నాన్ ప్లాన్ నిధుల క్రింద 58 పనులు (314.278 కిలోమీటర్) 173 కోట్ల 67 లక్షల రూపాయలతో మంజూరై, 246.44 కి.మీ పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి అని అన్నారు.
• రైల్వే సేఫ్టీ క్రింద ఆలేర్ లో రోడ్ అండర్ బ్రిడ్జి 11 కోట్ల రూపాయల తో మంజురై, పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.
పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ:
• 2021-22 నుండి 2024-25 సంవత్సరములలో CRR నిధులతో 44 రోడ్ల నిర్మాణ పనులు మంజూరి కాబడి, 6 పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతి లో ఉన్నవి అని, మరియు MRR నిధులతో 79 రోడ్ల నిర్మాణ పనులు మంజూరి కాబడి,18 పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతి లో ఉన్నవి అని అన్నారు.
• యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత అని,యువత ఉద్యోగ,ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం అని అన్నారు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం అని తెలిపారు 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని అన్నారు.
ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ:-
• జిల్లాలో గీత కార్మికుల సంక్షేమ కార్యక్రమములో భాగంగా 2025-26 సంవత్సరములో మరణించిన ఇద్దరు మరియు (04) మందికి తాత్కాలిక వికలాoగులకు గాను 10 లక్షల 40 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందజేయడం జరిగినది అని ,తెలంగాణాకు వన మహోత్సవం కార్యక్రమoలో భాగంగా 26 వేల 150 ఈత / ఖర్జూర మొక్కలు నాటడం జరిగింది అని అన్నారు.
పోలీస్ శాఖ :
• మన రాచకొండ పోలీసులు నేరాల నియంత్రణలో మన రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరాల నియంత్రణకై జిల్లాలో అన్ని గ్రామాలలో, పట్టాణాలలో ముఖ్యమైన కూడళ్ళలో సి.సి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిoది అని అన్నారు.
• జిల్లా ప్రజలలో సాంఘిక దురాచారాలపై అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ప్రజలలో సరియైన అవగాహన కల్పిస్తున్నారు అని అన్నారు.
• 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ –2047 ఉంటుంది అని అన్నారు ఇది కేవలం ప్రణాళిక కాదు అని, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం అని అన్నారు.
• యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి అందేటట్లు చేయడానికి సహకరిస్తున్న గౌరవ ప్రజాప్రతినిధులు,అధికారులు, అనధికారులు,పాత్రికేయులు, బ్యాంకర్లకు మరియు శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు మరియు విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు తెలియచేస్తూ ఇదే స్పూర్తితో అందరము కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడదాo అని ఆ దిశలో మనమoదరం అంకితమై శ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా ను అగ్రగామిగా నిలుపుదాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,జిల్లా కలెక్టర్ హనుమంతరావు,డిసిపి
అక్షాంశ్ యాదవ్ ,గ్రంధాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ,రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,జిల్లా అధికారులు , అమరవీరుల కుటుంబ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు .













