బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి— యాదాద్రి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి.
N TODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 29
గురువారం రోజున కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేయించడం కోసం జూన్ 6వ తేదీ నుండి జరిపే ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ జి.వీరారెడ్డి సంబంధిత అధికారులను కోరారు.ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమంలో బాగంగా సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చేపట్టిన విభిన్న కార్యక్రమాల వల్ల ఈ సంవత్సరం 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విషయం తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. ఫలితాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న డిజిటల్ విద్యా బోధన,సుశిక్షితులైన ఉపాధ్యాయులు , మధ్యాహ్న సన్న బియ్యం భోజన పథకం మరియు కల్పిస్తున్న వసతులను సమాజానికి వివరించే ప్రయత్నం చేయాలని అన్నారు. జూన్6 న జరిగే గ్రామ సభను ప్రతి ఆవాస ప్రాంతంలోని వారందరికీ సమాచారం అందించి భాగస్వాములను చేయాలని కోరారు.బడి బాటలో భాగంగా నిర్వహించే అన్ని రోజు వారీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు. జూన్ 7 నుండి 10 వరకు:ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన బడి బయటి పిల్లల గుర్తింపు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు,నమోదు పత్రాలపంపిణీ. జూన్11:పాఠశాలకు సంబంధించిన అన్ని వర్గాలతో సమావేశం నిర్వహించి చర్చిండం.
జూన్12:స్వాగత దినోత్సవం, అమ్మ ఆదర్శ పాఠశాల దినోత్సవం, తల్లిదండ్రులు – ఉపాద్యాయుల సమావేశం, జూన్13:సామూహిక అక్షరాభ్యాసం, బాల సభ నిర్వహణ, జూన్16: ఎఫ్.ఎల్.ఎన్.రోజు, అభ్యసనాభివృద్ధి కార్యక్రమం. జూన్17:ప్రత్యేక అవసరాల పిల్లల దినోత్సవం, బాలికా విద్యా దినోత్సవం. జూన్18:వన మహోత్సవం మరియు డిజిటల్ విద్యా బోధన దినోత్సవం. జూన్19:ఆట పాటల దినోత్సవ కార్యక్రమాలను జిల్లా నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జెడ్పీ సీ.ఈ. ఓ.శోభారాణి , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, వైద్యశాఖ అధికారి ఎం.మనోహర్, సంక్షేమ అధికారులు నరసింహారావు,యాదయ్య,వసంత కుమారి,సీ.ఎం.ఓ.పెసరు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.