తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు ) ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీకి మద్దతుగా తిరంగా ర్యాలీ
(NTODAY NEWS)
నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో ఆపరేషన్ సింధూరం విజయవంతం అయినందున ఇండియన్ ఆర్మీకి సంఘీభావంగా టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నీ ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నార్కట్ పళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్ పాక్ యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ లో అన్ని పార్టీల నాయకులు పట్టణ ప్రముఖులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టు యూనియన్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని భారత ఆర్మీకి సంఘీభావంగా నినాదాలు చేస్తూ చిట్యాల పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్ పై చేస్తున్న కుట్రని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాకుండా దేశ గొప్పతనాన్ని ఉగ్రవాద కార్యక్రమాలను అరికట్టడానికి భారత్ ముందు స్థానంలో ఉందని ప్రపంచ దేశాలకు తెలిసిందని అలాంటి ఆర్మీకి దేశ ప్రజలు అండగా ఉన్నారని గుర్తు చేశారు.పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో భారత్ గొప్పదనాన్ని భారత ఆర్మీ స్ట్రెంత్ ప్రపంచ దేశాలకు తెలియడమే కాకుండా భారతదేశంపై దాడి చేయాలన్న వ్యతిరేక దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చిన విధంగా అన్నారు. ఈ కార్యక్రమానికి టి యు డబ్ల్యూ జే (ఐజేయు) నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు వీళ్ళ బయన్న, జిల్లా కార్యదర్శి పెద్ది నరేందర్, నకిరేకల్ నియోజకవర్గ కమిటీ సభ్యులు నూతి లింగస్వామి, అవనిగంటి లింగస్వామి, కాలిన శ్రీశైలం, చిట్యాల మండల గౌరవాధ్యక్షులు మిరియాల ప్రకాష్, మండల అధ్యక్షుడు మెండే వెంకన్న,ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, ఉపాధ్యక్షులు ఏళ్ల వెంకన్న,కోశాధికారి చేరుపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కూనూరు మధు, సభ్యులు జిట్టా మల్లేష్, అమ్మరోజు వెంకన్న, మెహర్ బాబు, పట్టణంలోని వివిధ రాజకీయ నాయకులు ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తిరంగారాలేని విజయవంతం చేశారు.