ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్ ఇటీవల ఇలాంటి స్కామ్ ను గుర్తించింది.భారతీయులే లక్ష్యంగా మాల్వేర్ ను రూపొందించి, వాట్సాప్‌లో మోసపూరిత ట్రాఫిక్ ఇ-చలాన్ మెసేజ్ ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టు వివరించింది. వీరు రూపొందించిన అధునాతన ఆండ్రాయిడ్ మాల్వేర్ ఇప్పటికే 4,400 పరికరాలపై ప్రభావం చూపిందని, సుమారు రూ.16 లక్షలకు పైగా మోసపూరిత లావాదేవీలకు దారి తీసిందని తెలిపింది.
సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కొత్త పద్ధతులతో స్కామ్ లకు తెరలేపుతున్నారు. వీరు పాల్పడుతున్నమోసాలను గుర్తించడం కష్టమవుతోంది. చాలామంది తమ సొమ్ములను పొగొట్టుకుంటున్నారు. ఇటీవల ట్రాఫిక్ ఇ-చలాన్ పేరుతో వాట్సాప్ కు నకిలీ మెసేజ్ లు వస్తున్నాయి. వాటిని నిజమని నమ్మి అందులో తెలిపిన లింక్ లను క్లిక్ చేయడం వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
ఇ-చలాన్ స్కామ్..
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ సెక్ ఇటీవల ఇలాంటి స్కామ్ ను గుర్తించింది. వియత్నమీస్ హాకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. భారతీయులే లక్ష్యంగా మాల్వేర్ ను రూపొందించి, వాట్సాప్‌లో మోసపూరిత ట్రాఫిక్ ఇ-చలాన్ మెసేజ్ ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టు వివరించింది. వీరు రూపొందించిన అధునాతన ఆండ్రాయిడ్ మాల్వేర్ ఇప్పటికే 4,400 పరికరాలపై ప్రభావం చూపిందని, సుమారు రూ.16 లక్షలకు పైగా మోసపూరిత లావాదేవీలకు దారి తీసిందని తెలిపింది.
నకిలీ చలాన్..
వియత్నమీస్ హ్యాకర్ల నుంచి ముందుగా మన ఫోన్ కు ట్రాఫిక్ ఇ-చలాన్ నోటిఫికేషన్ వస్తుంది. పరివాహన్ సేవ, కర్ణాటక పోలీస్ తదితర పేర్లతో నిజమైన చలాన్ మాదిరిగానే ఉంటుంది. మీరు ట్రాఫిక్ ఉల్లంఘించారు కాబట్టి జరిమానా కట్టాలను మెసేజ్ లో చెబుతారు. నిజమని భావించి దానిలోని లింక్ ను క్లిక్ చేస్తే, ట్రాఫిక్ చలాన్ చెల్లించడానికి ఓ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తుంది. హానికరమైన ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మీ కాంటాక్ట్స్, ఎస్ఎమ్ఎస్, ఫోన్ కాల్స్ తదితర వాటికి అనుమతి అడుగుతుంది.
రూ.16 లక్షలకు పైగా మోసం..
ఆ యాప్ ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మాల్వేర్ రహస్యంగా పనిచేస్తుంది, మన ఓటీపీలు (వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు), ముఖ్యమైన మెసేజ్ లను తస్కరిస్తుంది. దీని వల్ల మన ఇ-కామర్స్ ఖాతాను హ్యాక్ చేయవచ్చు, అలాగే అనధికార లావాదేవీలను నిర్వహించవచ్చు. మన బహుమతి కార్డులను కూడా దొంగిలించవచ్చు. అలాగే మన ఫోన్ లోని కాంటాక్టుల ద్వారా అనేక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. హ్యాకర్ల ఇలా ఇప్పటి వరకూ 271 ప్రత్యేక బహుమతి కార్డులను విజయవంతంగా యాక్సెస్ చేశారు. సుమారు రూ.16 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపారు. గుజరాత్, కర్నాటకలో ఈ స్కామ్ బాధితులు ఎక్కువగా ఉన్నారు.
భద్రతా చర్యలు..
ఇలాంటి మోసాలను నుంచి రక్షించుకోవడానికి క్లౌడ్ సెక్ కొన్ని భద్రతా చర్యలను సూచించింది. వాటిని పాటించడం వల్ల సురక్షితంగా ఉండవచ్చు.
- గూగుల్ ప్లే స్లోర్ తదితర విశ్వసనీయమైన వాటి నుంచే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలి.
- మాల్వేర్ ద్వారా దోపిడీకి గురయ్యే ప్రమాదాలను తగ్గించడానికి తాజా సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌లు, సెక్యూరిటీ పరికరాలను అప్‌డేట్ చేయండి.
- బ్యాంకింగ్ లావాదేవీలు, సున్నితమైన సేవల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇ-చలాన్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెసేజ్ రాగానే కంగారు పడకుండా అన్ని విషయాలు పరిశీలించాలి.
Leave a Reply