జాతీయ రహదారిపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్
NTODAY NEWS: చిట్యాల
రైల్వే బ్రిడ్జి కింద నీళ్లు బురద చేరటం తో భారీ ట్రాఫిక్ జామ్
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద భారీగా నీరురావడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. రైల్వే బ్రిడ్జి కింద నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల వలన పోతరాజు కుంట నిండిపోవడంతో కుంటకు అధికంగా నీరు రావటంతో జాతీయ రహదారిపై ప్రవహిస్తున్నాయి దానితోపాటు రహదారిపై బురద పేరుకుపోవడంతో చిన్న చిన్న వాహనాలు ఇరుక్కు పోవడంతో పాటు చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. జాతీయ రహదారి పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇరుక్కుపోయిన వాహనాలను మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి సైతం తమ వంతు కృషి చేశారు. టోల్గేట్ సిబ్బంది , నేషనల్ హైవే సంబంధించిన అధికారులు సరైన సమయంలో స్పందించి ఇటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చేయాలని వాహనదారులు వాపోయారు. చాలా గంటల తర్వాత అధికారులు స్థానిక పోలీసులు స్పందించి ట్రాఫిక్ ను పెద్దకాపర్తి, రామన్నపేట మీదుగా మళ్ళించారు. వాహనాలు దారి మళ్లించడంతో రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం దాటిన తర్వాత ఉన్న రైల్వే బ్రిడ్జి కూడా నీళ్లు నిలవడంతో వాహనాలు తిరిగి వస్తున్న తరుణంలో పెద్ద కాపర్తి, రామన్నపేట మధ్య మరికొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి.
Follow us on
Website
Facebook
Instagram
YouTube

