టీయుడబ్ల్యూజే విలేకరుల సమస్యల పరిష్కారం —జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డి
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో టీయుడబ్ల్యూజే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో టీయూడబ్ల్యూజే ఎల్లవేళలా ముందుంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని పెన్షనర్స్ భవన్ లో మంగళవారం జరిగిన మండల యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు వైద్య సేవల కావలసిన హెల్త్ కార్డుల పంపిణీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో యూనియన్ జరుగుతున్న చర్చలు కొలిక్కి వస్తున్నాయని, అది త్వరలోనే అమలులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల విషయంలో కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. జర్నలిస్టులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశాలు కల్పించాలని ఇటీవలే రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తో సంప్రదింపులు జరిగినట్లు, ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను యూనియన్ ఆధ్వర్యంలో పరిష్కరించబడ్డాయని అన్నారు. మండల స్థాయి నుండి జర్నలిస్టులంతా సంఘటితంగా ఉండి సమస్యల పరిష్కారంలో సంఘానికి చేయూతని అందించాలని ఆయన సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జర్నలిస్టులు తమ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని వృత్తి పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండాలని కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమల నాగయ్య మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల పంపిణీ అంశం త్వరలోనే పరిష్కారం కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంఘం పటిష్టత కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దోసపాటి సత్యనారాయణ, వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాదరి యాదగిరి, దోతీ శ్రీనివాస్, ఏళ్ల బయన్న, పెద్ది నరేందర్,మెండే వెంకన్న,ఏళ్ల వెంకన్న,చెరుపల్లి శ్రీనివాస్,పోకల కరుణాకర్, కూనూరు మధు తదితరులు పాల్గొన్నారు.