చింతలపూడి లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు ఆధ్వర్యంలో వనం – మనం కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ హాజరై కూటమి నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయిన వనం – మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి టీడీపీ టౌన్ అధ్యక్షులు తాటి అప్పారావు, జనసేన మండల అధ్యక్షులు చీదరాల మధు, బిజెపి టౌన్ అధ్యక్షులు కొత్తపల్లి విజయ, ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్, జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, మాజీ సర్పంచ్ చిట్లూరి ధర్మరాజు, కంచర్ల అబ్రహం, బిజెపి నాయకులు నారాయణరావు, దూదిగం మోహన్, బూసి రమేష్ , నత్త రవి,కొనకళ్ళ సతీష్, బోడ సాగర్, చిట్లూరి రాజా, సుభాని,మన్యం సత్తిబాబు, కంభం రమేష్ ,సొంగ ఏసు పాదం,జనసేన నాయకులు ఆకుల మధు, పోతుల శ్రీను,సునీత, గుంషావలి ,జైపాల్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.