గ్రామ పాలన అధికారి పరీక్షలు ప్రశాంతం
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, మే 25
గ్రామ పాలన అధికారి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వెనక ఉన్న వెన్నెల కళాశాలలో ఏర్పాట్లు చేసిన గ్రామ పాలన అధికారి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పాలన అధికారి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు తెలియజేశారు.ఈ పరీక్షకు 151 మందికి గాను 12మంది ఆబ్సెంట్ కాగా,139 మంది పరీక్షకు హాజరయ్యారయినట్లు పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి ,వెన్నెల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.