నాగినేనిపల్లి గ్రామంలో నీటి కటకట, పట్టించుకోని అధికారులు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో కొద్ది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సివస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రైవేటు ట్యాంకర్లను తెప్పించుకుని ఇతర అవసరాలను తీర్చుకుంటున్నామని తెలిపారు. ట్యాంకర్ నుండి నీరు తెప్పించుకుంటున్నారంటే గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు సార్లు మిషన్ భగీరథ అధికారులకు పంచాయితీ కార్యదర్శికి తమ సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కింద బస్తీలో సుమారు 60. కుటుంబాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవ డంతో తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. భగీరథ నీటిసరఫరా నిలిచిపోతే గ్రామ పంచాయితీ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉండగా గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకున్న పాపనా పోలేదు గత మూడు రోజుల నుంచి తాగునీరు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రైవేటు ట్యాంకర్లు తెప్పించుకుని అవసరాలు తీర్చు కోవాల్సివస్తోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండ టంలేదు.సమస్య పరిష్కరించాల్సిన అధికారులు సమన్వయ లోపంతో సమస్య మరింత తీవ్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కింది బస్తీలో మూడు రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదని పలుసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. బిందెడు నీటి కోసం పడరానిపాట్లు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తంచేశారు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు మిషన్ భగీరథ,పంచాయతీ అధికారుల సమన్వయలోపం వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సత్వరమే పరిష్కారం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.













