చిట్యాల పోతరాజు కుంటను పునరుద్ధరిస్తాం : ఆర్డిఓ అశోక్ రెడ్డి
NTODAY NEWS : చిట్యాల
నల్లగొండ జిల్లా చిట్యాల లో జాతీయ రహదారి 65 పై రైల్వే అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలుస్తున్న ప్రదేశాన్ని ఆర్డీవో అశోక్ రెడ్డి,NHAI అధికారులతో సోమవారం రోజున పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద నీరు నిలవడంతో గత మూడు రోజుల నుంచి జాతీయ రహదారి 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని అన్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్, ఫైర్ , మున్సిపల్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొని మోటార్లు పెట్టి ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపిస్తున్నారని, చిట్యాల పట్టణానికి సంబంధించిన వర్షపు నీరు జాతీయ రహదారి నుంచి పోతరాజు కుంటకు వెళ్లే విధంగా గతంలో NHAI వాళ్ళు ఏర్పాటు చేశారు.అని అన్నారు. పోతరాజు కుంట ఆక్రమణకు గురి కావడం మరియు మున్సిపల్ వాళ్లు చెత్త వేయడంతో కుంట నీరు నిలువకుండా పూర్తిగా నిండిపోవడం ద్వారా రైల్వే అండర్ ప్రాస్ కింద నీరు నిలిచిపోతుంది అని అన్నారు. పోతరాజు కుంటలో ఉన్న ఆక్రమాలను తొలగించి నీరు నిలిచే విధంగా పనులను పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చేస్తాం అని, పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కి సమర్పించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, ఇంచార్జ్ తాసిల్దార్ విజయ పాల్గొన్నారు.

