తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైయస్‌ఆర్
NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్ :-వినోద్ కుమార్
తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకం.. సంక్షేమ పథకాల్లో చెరగని సంతకం ముద్ర వేసిన దివంగత నేత డా” వైయస్‌ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న దివంగతనేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సమన్వయకర్త బి. యస్.మక్బూల్.
దివంగత నేత వై.యస్.రాజశేఖరరెడ్డి జనం మధ్యలో లేకపోయినా జనం గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని కదిరి వైసిపి నాయకులు మక్బూల్ అహమ్మద్ తెలిపారు. దివంగత మహానేత డా వై.యస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయంలో దగ్గర వున్న వైయస్‌ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మున్సిపల్ కార్యాలయంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బి.యస్.మక్బూల్ అహమ్మద్ మాట్లాడుతూ పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర భగీరధుడు, రైతు బాందవుడు, ఆరోగ్య శ్రీ ప్రదాత, విద్యా విధాత, ఓటమి ఎరుగని ధీరుడు, దివంగత నేత మనందరి ప్రియతమ నాయకుడు మహానేత వై యస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిద్దాం
వైయస్ రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారిగా 1978 వ సంవత్సరంలో పులివెందుల నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు,ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచి రాజకీయ జీవితంలో ఓటమెరుగని దీరుడిగా హిస్టరీ క్రియేట్ చేసిన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి.
వైయస్ రాజశేఖర్ రెడ్డి 2003లో పాదయాత్ర ప్రారంభించి 1460 కిలోమీటర్లు మండుటెండల్లో నడిచి ప్రజల కష్టాలను రైతుల కష్టాలను విద్యార్థుల కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో రైతులకు మొదటి హామీగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు,ప్రజాప్రతినిధులు , మండల కమిటీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

