ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
NTODAY NEWS: ఏలూరు
బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్, తనికీలో భాగంగా రోగులకు అందిస్తున్న సదుపాయాలు, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి వసతి మొదలైన అంశాలను సమీక్షించారు. ఆసుపత్రి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీ MS రాజు, బెడ్స్ కొరత ఉన్న విషయం మరియు రోగుల వసతి కోసం పేషెంట్ షెడ్ అవసరం ఉందని వివరించారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్, షెడ్ నిర్మాణానికి కావలసిన అంచనాలు సిద్ధం చేసి పంపవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఘంటా ప్రసాద్ రావు పాల్గొన్నారు.













