ఎల్బీనగర్ సెప్టెంబర్ 30/ntodaynews/ప్రతినిధి.
ఎన్నో సంఘాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బదనాపురం.. రఘు. మాట్లాడుతూ
ఆనాటి మహనీయులు ఎరుకల అమరవీరులు త్యాగాలను మరవవద్దు జోహార్ ఎరుకల అమరవీరులకు జోహార్ జోహార్
20 సంవత్సరాలు కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలతో సుదీర్ఘ పోరాటం ఫలితం 1976 సెప్టెంబర్ 30 తేదీనాడు తెలంగాణ రాష్ట్ర ఎరుకల ప్రజలకు ఆదివాసి ఎరుకల ఎస్టి జాబితాలో రిజర్వేషన్ ఎరుకల జాతి ప్రజలకు జీవించే హక్కు కలిగించిన ఆ మహనీయుల యొక్క పెట్టిన భిక్షతో మన కుటుంబాలు బ్రతుకుతున్నాం… ఆ మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి మన జాతి ప్రజలకు విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయంగా, విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఉన్నతమైన ఉద్యోగ అధికారులు, లాయర్లు, జడ్జిలు, బ్యాంక్ కార్పొరేషన్ మేనేజర్స్, టీచర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్, పోలీస్, ఇతర శాఖలలో ఉద్యోగ పొందిన ఎరుకల ప్రజలు మరియు పారిశ్రామిక రంగాలలో సబ్సిడీలు పొందుతున్నాం అంటే.ఎరుకల అమరవీరుల త్యాగాలను వెలకట్టలేం. మన బ్రతుకులలో వెలుగు నింపిన ఆ మహనీయులు ఆశయ సాధనలో ఎంతోమంది వారి వెంట నడిచిన ఎరుకల కార్యకర్తలు కోకోలలు.
మీ త్యాగాలను మరవకుండా ప్రతి ఏటా భవిష్యత్ తరాలకు మార్గంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి కుమార్ ఆధ్వర్యంలో..మహనీయులను గుర్తు చేస్తారు. జెండా పండుగ తో పాటు పేద ఎరుకల ప్రజలకు చదువుకోడానికి విద్యార్థులకు పుస్తకాలు మరియు క్రీడా రంగాలలో విద్యార్థులు ఆడుకొనడానికి వస్తువులను పంపిణీ కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నాం. ఆ సందర్భంలో ఏకలవ్య అవార్డులతో, పాటు మరియు జిల్లాల వారీగా మన జాతిని ఐక్యమత్యంతో మనకు రావాల్సిన హక్కులపై నిరంతంగా పనిచేస్తున్న ఎరుకల నాయకులకు, ప్రశంస పత్రాలు అందజేస్తూ మంచి నాయకులని ఎదిగే విధంగా తీర్చిదిద్దుతుంది.
TPYS తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఎన్నో సంఘాలకు ఆదర్శంగా నిలిచిన ఏకైక సంఘం TPYS అదే కాకుండా ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతూ మన రిజర్వేషన్ తో పాటు లంబాడా,యానాది, రిజర్వేషన్ ని కలిగించడానికి ఎంతో కీలక పాత్ర పోషించిన గొప్ప సంగం.కానీ భవిష్యత్ తరాలకు మనం ఏం చేస్తున్నా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.ఎరుకల జాతి పట్ల ఏ ఒక్క భాష పట్ల కానీ మనకున్న చరిత్ర ఏకలవ్య ఎరుకల నాంచారమ్మ, చరిత్రపై ప్రభుత్వం చేత నేటికి ఎలాంటి ఆధారాలు చూపించలేని పరిస్థితిలో మన చరిత్రని మన సంస్కృతిని చెప్పడంలో మనం విఫలమయ్యాం.మన చరిత్రను ఎవరు రాయరు? మన చరిత్రను మనం అధ్యయనం చేయాలి అప్పుడే మన చరిత్రకు అర్థం ఉంటుంది.
యూనివర్సిటీలో చదువుకున్న మేధావులు, ఉన్నతమైన పదవుల్లో ఉన్న ఉద్యోగ మేధావులు మన చరిత్రను మనము చెప్పకపోతే ఆ జాతి అంతరించిపోతుంది.మన జాతి భాషని కాపాడుకుందాం …. చరిత్ర పునాదులను వెలుగులోకి తీసుకొస్తాం ఓ నా ఆదివాసి ఎరుకల ప్రజలారా! అని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కరికల ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బదనాపురం రఘు .స్థానిక సంఘం బాలాపూర్ మండల అధ్యక్షులు కూతాడి రామకృష్ణ .సలహాదారుడు శంకర్ .కార్తీక్. తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply