బర్త్ డే బాయ్ మూవీ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా…

Spread the love

కొన్నిసార్లు సినిమా పేర్లు కూడా తెలియకుండా.. అందులో ఎవరు నటించారో కూడా తెలియకుండా కేవలం ట్రైలర్ చూసి.. అందులో కంటెంట్ చూసి సినిమాలకు వెళ్తుంటాం. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా బర్త్ డే బాయ్. పూర్తిగా అమెరికా నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉందో చూద్దాం.. సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో డీటైల్డ్‌గా మాట్లాడుకుందాం..

నటీనటులు: ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: సంకీర్త్ రాహుల్

‌సంగీతం: ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్

ఎడిట‌ర్‌: న‌రేష్ ఆడుపా

నిర్మాత: ఐ.భ‌ర‌త్‌

దర్శకత్వం: విస్కి

కొన్నిసార్లు సినిమా పేర్లు కూడా తెలియకుండా.. అందులో ఎవరు నటించారో కూడా తెలియకుండా కేవలం ట్రైలర్ చూసి.. అందులో కంటెంట్ చూసి సినిమాలకు వెళ్తుంటాం. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా బర్త్ డే బాయ్. పూర్తిగా అమెరికా నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉందో చూద్దాం.. సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో డీటైల్డ్‌గా మాట్లాడుకుందాం..

కథ:

బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి (మణి, వెంకీ, రాజా అశోక్, అరుణ్, రాహుల్) ఐదుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకే ఊరు వాళ్లు కూడా. అంతా అమెరికాలో చదువుకోడానికి వెళ్తారు. అక్కడే ఒకే రూమ్‌లో ఉండి చదువుకుంటూ ఉంటారు. బాలు బర్త్ డే కావడంతో గ్రాండ్‌గా.. కాస్త వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఆ పార్టీలో పీకల దాక తాగి.. ఇష్టమొచ్చినట్లు బాలుపై శృతిమించి దాడి చేస్తారు. వాళ్లు చేసిన సెలబ్రేషన్స్‌తో బాలు (మణి) చనిపోతాడు. దాంతో నలుగురికి ఏం చేయాలో అర్థం కాదు.. వెంటనే అర్జున్ (వెంకీ) తన అన్న, లాయర్ భరత్ (రవికృష్ణ) ను ఇంటికి పిలుస్తారు. జరిగింది మొత్తం చెప్తారు.. భరత్ తన బావమరిది ప్రవీణ్‌ను కూడా పిలిచి జరిగింది చెప్తాడు. ఆ ఇల్లు తన పేరు మీదే ఉంటుంది కాబట్టి ఏ రిస్క్ తీసుకోలేనని.. జరిగింది పోలీసులకు చెబుదామంటాడు ప్రవీణ్. కానీ స్టూడెంట్స్ భవిష్యత్తు పోతుందని.. మనమే ఏదో ఒకటి చేద్దాం అంటూ ప్రవీణ్‌ను కన్విన్స్ చేస్తాడు భరత్. ఇదే సమయంలో ఇండియాలో ఉన్న బాలు తల్లిదండ్రులు (ప్రమోదిని, రాజీవ్ కనకాల) విషయం తెలిసి అమెరికాకు వస్తారు.. అప్పుడేం జరిగింది..? అసలు బాలు ఎలా చచ్చిపోయాడు.. నిజంగానే పార్టీలో చనిపోయాడా లేదంటే ఎవరైనా కావాలని చంపారా అనేది స్క్రీన్ మీద చూడాలి..

కథనం:

బర్త్ డే బాయ్ సినిమాకు అతిపెద్ద ప్లస్.. అస్సలు టైమ్ వేస్ట్ చేయకపోవడం. సినిమా మొదలైన 10 నిమిషాలకే అసలు కథ మొదలవుతుంది. ఎక్కడా టైమ్ తీసుకోలేదు దర్శకుడు. చిన్న పాటతో కథను మొదలు పెట్టి.. నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. సినిమా మొదలవ్వడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ పాట.. వెంటనే బర్త్ డే పార్టీ.. ఆ పార్టీలో కుర్రాళ్లు చేసే పిచ్చి పనులు.. స్నేహితుడితో ఆడుకోవడం.. అతడు చనిపోవడం.. వెంటనే భరత్ కారెక్టర్ కథలోకి రావడం.. ఇలా ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు దర్శకుడు విస్కీ. కథ వేగంగా వెళ్లిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా బర్త్ డే బాయ్ సినిమాకు ఉన్న మరో అడ్వాంటేజ్ ఈజీగా రిలేట్ అయ్యే కథ. ఈ మధ్య చాలా చోట్ల బర్త్ డే పార్టీల పేరుతో చేస్తున్న వికృత చేష్టలు చూస్తూనే ఉన్నాం కదా.. అదే ఈ సినిమాలోనూ చూపించాడు దర్శకుడు విస్కీ. అక్కడే సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. భరత్ వచ్చిన తర్వాత బాడీని ఏం చేయాలనే డిస్కషన్ మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా ఇలాగే సాగుతుంది. కేవలం ఆరుగురు కారెక్టర్స్‌తోనే సినిమాను చాలా బాగా నడిపించాడు దర్శకుడు విస్కీ. ఇంటర్వెల్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా వెళ్లిపోతుంది. ముఖ్యంగా బాలు డెడ్ బాడీ చుట్టూ అల్లుకున్న డ్రామా వర్కవుట్ అయింది. రవికృష్ణ, సమీర్ మళ్లా కారెక్టర్స్ వచ్చిన తర్వాత కథ మరింత ఆసక్తికరంగా ముందుకెళ్లింది. ఇండియాలో ఉన్న వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడటం.. వాళ్లు పోన్ చేస్తుంటే ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతుండటం.. ఇవన్నీ బాగున్నాయి. సెకండాఫ్ కూడా ఇదే కథను కంటిన్యూ చేస్తాడు అనుకుంటున్న తరుణంలో.. ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి కథను మరో మలుపు తిప్పాడు దర్శకుడు విస్కీ. అక్కడి వరకు సినిమాపై ఉన్న ఇంప్రెషన్ కాస్త తగ్గుతుంది కానీ బోర్ అయితే కొట్టదు. సెకండాఫ్ కథ కంటే ఎక్కువగా ఎమోషన్స్‌పై ఫోకస్ చేసాడు దర్శకుడు. అక్కడ కాస్త ల్యాగ్ సీన్స్ పడ్డాయి. ఇండియా నుంచి బాలు తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కథ మరో మలుపు తీసుకుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి.

నటీనటులు:

సినిమా చూడ్డానికి అన్నిసార్లు తెలిసిన మొహాలే ఉండక్కర్లేదు. కథతో రిలేట్ అయ్యే పాత్రలు ఉంటే చాలు. ఇది చాలా కొన్ని సినిమాలకు మాత్రమే వర్కవుట్ అవుతుంది. తాజాగా బర్త్ డే బాయ్ విషయంలోనూ ఇదే జరిగింది. బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, రాజీవ్ కనకాల మాత్రమే ఈ సినిమాలో తెలిసిన మొహాలు. వాళ్లు కాకుండా మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే. కానీ చాలా న్యాచురల్‌గా నటించారు.. వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా నలుగురు ఫ్రెండ్స్ కారెక్టర్స్ అయితే చాలా బాగా నటించారు.

టెక్నికల్ టీం:

బర్త్ డే బాయ్ సినిమాకు సంగీతం హైలైట్. సినిమా మూడ్‌ను పెంచేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. ఈ విషయంలో సంగీత దర్శకుడు ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్ సక్సెస్ అయ్యాడు. అలాగే సంకీర్త్ రాహుల్ సినిమాటోగ్రఫి అదిరిపోయింది. ఎడిటర్ నరేష్ కూడా తన వర్క్ బాగా చేసాడు. కేవలం 2 గంటల్లో చెప్పాల్సిన కథను చెప్పారు. అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా.. అంతగా విసుగు తెప్పించేలా మాత్రం లేవు. నిర్మాత భరత్ కథకు తగ్గట్లు బాగానే ఖర్చు చేసాడు. దర్శకుడు విస్కీ నిజంగా జరిగిన ఓ కథను స్క్రీన్ మీద చాలా చక్కగా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేసాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా బర్త్ డే బాయ్.. కొత్తగా ఉంది.. ఇట్స్ ఇంట్రెస్టింగ్..!