వట్లూరులో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

Spread the love

వట్లూరులో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

NTODAY NEWS:వట్లూరు

వట్లూరు (పెదపాడు) 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు పీ.ఎం. శ్రీ.డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులం వట్లూరులో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జ్యోతి ప్రజ్వల చేసి, ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి మాట్లాడుతూ, ఎందరో మహావీరుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం మహా వీరులను ఆదర్శంగా తీసుకుని, చిన్ననాటి నుంచి దేశభక్తిని పెంపొందించుకోవాలని , నేటి బాలలే రేపటి పౌరులని మంచి విషయాలనకు ముందుండాలని ,దేశాభివృద్ధికి తోడ్పడాలని , వివరించారు. 6వ తరగతి విద్యార్థినిలు
దేశ నాయకులు అలంకరణతో ఆకర్షణీయంగా నిలిచారు. విద్యార్థినిలు సాంస్కృతిక కార్యక్రమాలతో, దేశభక్తి ఆటపాటలతో అలరించారు. అదేవిధంగా ఈరోజు ఎస్ .వి.మీనాక్షి (జె ఎల్ మ్యాథమెటిక్స్), గౌరవ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నందుకు గాను ప్రిన్సిపాల్  దాసరి మేరీ ఝాన్సీ రాణి  ,మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ శుభాకాంక్షలు తెలియజేసి, హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిలకు ప్రిన్సిపాల్ దాసరి మేరి ఝాన్సీ రాణి స్వయంగా విద్యార్థులకు ఆపిల్ ,చాక్లెట్స్, బిస్కెట్స్, స్వయంగా పంచిపెట్టారు.

Follow us on
Website
Facebook
Instagram
YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Translate »